Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఇది చైనా పోలీసులు కరోనా వైరస్ రోగులను పట్టుకుంటున్న వీడియో కాదు. హాంగ్ కాంగ్ కి సంబంధించినది

0

చైనా లో పోలీసులు కరోనా వైరస్ సోకిన వారిని పట్టుకుంటున్న వీడియో అని క్లెయిమ్ చేస్తూ  ఒక పోస్ట్ ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ చేసే క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో  పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనాలో పోలీసులు కరోనా వైరస్ సోకిన వారిని పట్టుకుంటున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో చైనాకి పంపడానికి అనుమతినిచ్చే ఒక వివాదాస్పద బిల్ ను వ్యతిరేకిస్తున్న నిరసనకారుల పై హాంగ్ కాంగ్ పోలీసులు చేసిన దాడికి సంబంధించిందిది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో షేర్ చేసిన వీడియో కీఫ్రేమ్‌ లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే హాంకాంగ్‌లో పోలీసులకు  మరియు నిరసనకారులకు మధ్య జరిగిన గొడవలు సెర్చ్ రిజల్ట్స్ లో లభించాయి. ‘The Guardian’ వారు ప్రచురించిన కథనం ప్రకారం, ఆ వీడియోలోని సంఘటన హాంగ్ కాంగ్ పోలీసులు మరియు చైనా కి పంపడానికి అనుమతినిచ్చే ఒక వివాదాస్పద బిల్ కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల మధ్య జరిగిన ఒక గొడవకి సంబంధించింది. ఆ వీడియోలో ఉన్నది ఆగస్టు 2019లో మాస్ ట్రాన్సిట్ రైల్వే స్టేషన్ ‘ప్రిన్స్ ఎడ్వర్డ్’ ను ధ్వంసం చేస్తున్న నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటిది. అదే విషయాన్ని ‘BBC’ ఆర్టికల్ లో కూడా చూడవచ్చు.

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి  డిసెంబర్ 2019 చివరి వారం లో మొదలయిందని రిపోర్ట్ అయితే, వీడియోలో ఉన్న సంఘటన దానికి మూడు నెలల ముందు హాంకాంగ్‌లో జరిగింది.

చివరిగా, హాంకాంగ్‌ పోలీసులు అక్కడ నిరసనకారుల మీద జరుపుతున్న దాడికి  సంబంధించిన వీడియోను చైనా పోలీసులు అక్కడ కరోనా వైరస్ సోకిన వారిని కస్టడీ లోకి తీసుకుంటున్న వీడియో అని తప్పు ప్రచారం చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll