Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఒక మూవీ క్లిప్ పెట్టి, ‘ఇటలీలో ప్రస్తుత పరిస్థితి ఇది’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘ఇటలీలో ప్రస్తుత పరిస్థితి ఇది’ అని చెప్తూ, కొన్ని శవాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో కట్టి కుప్పలా వేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటలీలో శవాలను కుప్పలా వేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం):పోస్ట్ లోని వీడియో నిజమైనది కాదు. 2007 లో విడుదల అయిన ‘పాండమిక్‌’ అనే మినీ-సిరీస్ మూవీ క్లిప్ అది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియో యొక్క పూర్తి వెర్షన్ యూట్యూబ్ లో కనిపిస్తుంది. ఆ వీడియోలో యాంకర్ మాట్లాడుతూ ‘రిప్టైడ్ వైరస్’ వల్ల ఆ మరణాలు సంభవించినట్టు చెప్తుంది. కావున, ‘రిప్టైడ్ వైరస్’ అని గూగుల్ లో వెతకగా, 2007 లో విడుదల అయిన ‘పాండమిక్‌’ అనే మినీ-సిరీస్ మూవీ ‘రిప్టైడ్ వైరస్’ మీద తీసినట్టు తెలుస్తుంది.

ఆ మూవీలో 2:27:39 సమయం దగ్గర పోస్టులో పెట్టిన వీడియో యొక్క సన్నివేశాలు చూడవొచ్చు. పూర్తి మూవీని యూట్యూబ్ లో  (ఇక్కడ మరియు ఇక్కడ) చూడవొచ్చు.

చివరగా, ఒక మూవీ క్లిప్ పెట్టి, ‘ఇటలీలో ప్రస్తుత పరిస్థితి ఇది’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll