Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

బ్రెజిల్ పోలీసులు దుండగుడిని అరెస్ట్ చేస్తున్న వీడియోని ‘ఇటలీ లాక్ డౌన్’ వీడియో గా షేర్ చేస్తున్నారు

0

ఇటలీ లో కొరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చేసిన ‘లాక్ డౌన్’ లో ఒక వ్యక్తి రోడ్ మీద కనిపించడంతో పోలీసులు అతన్ని కిందపడేసి చేతులకు సంకెళ్లు వేస్తున్నారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ చేసే క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటలీలో లాక్ డౌన్ సమయంలో తిరుగుతున్న వ్యక్తి ని అక్కడి పోలీసులు అడ్డుకుంటున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఆ వీడియో బ్రెజిల్ కి సంబంధించింది, అందులో మార్చ్ 19న, సావో పాలోలో కత్తి పట్టుకుని బెదిరిస్తున్నాడని ఆరోపించబడ్డ ఒక దుండగుడిని పోలీసులు కిందపడేసి సంకెళ్లు వేస్తున్నారు. ఆ వీడియోకు ఇటలీ కి ఎంటువంటి సంబంధం లేదు. కాబట్టి, పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఆ వీడియో స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే అదే వీడియో BJP నేషనల్ మీడియా ప్యానలిస్ట్ షేర్ చేసిన ట్వీట్ లో కనిపించింది. ఆ ట్వీట్ లో అతను భారత దేశపు పోలీసులు కూడా ఎవరైనా ప్రజలు లాక్ డౌన్ లో బయటకు వస్తే అలానే చేయాలని చెప్పడం చూడవచ్చు.

అయితే కొంతమంది ఆ ట్వీట్ కింద ఆ వీడియో ఇటలీకి  సంబంధించిన వీడియో కాదని, బ్రెజిల్ కి సంబంధించిన వీడియో అని కామెంట్ చేసారు. అంతేకాక,  ఆ కామెంట్స్ లో ఒక యూజర్ ఆ   వీడియోలో ఉన్న సంఘటన కి సంబంధించిన న్యూస్ రిపోర్ట్ ని కూడా పెట్టాడు.

‘Hoodsite’ వెబ్సైటు లోని కథనం ప్రకారం సావో పాలో (బ్రెజిల్) లోని అవెనిడా డో ఎస్టాడో దగ్గర కొంతమంది జనాలని కత్తితో బెదిరించాడని ఆరోపింపబడ్డ ఒక దుండగుడుని అక్కడ మిలిటరీ పోలీసులు (PM) కిందపడేసి అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసారు. కావున, పోస్ట్ లో షేర్ చేసిన వీడియో కి ఇటలీ కి ఎటువంటి సంబంధం లేదు. అదే విషయాన్ని ‘Globo’ అనే ఒక బ్రెజీలియన్ న్యూస్ ఏజెన్సీ వారి ఆర్టికల్ లో కూడా చూడవచ్చు.

కొరోనా వైరస్ వల్ల ఇటలీ మార్చ్ 9 నుండి ఆంక్షలు విధించి లాక్ డౌన్ లో ఉంది. అయితే, ఇటీవల మార్చ్ 22న, ఇటలీ లో కొరోనావైరస్ ద్వారా మృతి చెందిన వారి సంఖ్య 5000 దాటడం తో ఆ దేశపు ప్రధాన మంత్రి దేశంలో ప్రజలు తిరగడాన్ని నిషేధించారు.

చివరగా, బ్రెజిల్ పోలీసులు కత్తిని పట్టుకుని బెదిరిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్న వీడియో ని ఇటలీ కి సంబంధించిన ‘లాక్ డౌన్’ వీడియో అని తప్పు షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll