Fact Check, Fake News, Telugu
 

తెలంగాణ MLC ఎన్నికల ఫలితాలకు సంబంధించి ‘V6 వెలుగు’ దినపత్రిక ఎటువంటి సర్వే నిర్వహించలేదు

0

‘V6 వెలుగు’ దినపత్రిక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన MLC వోటర్ సర్వే యొక్క ఫలితాలు, అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ అవుతున్నాయి. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఒక పోస్టులో తెరాస అభ్యర్ధికి అత్యధికంగా 52 శాతం వోట్లు పడుతాయని తెలుపగా, మరొక పోస్టులో తెరాస అభ్యర్ధికి 6 శాతం వోట్లు మాత్రమే పడుతాయని ‘వెలుగు’ సర్వే తెలిపినట్టు షేర్ చేస్తున్నారు. 14 మర్చి 2021 నాడు తెలంగాణ లో రెండు MLC స్థానాలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో, ఈ పోస్టులు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘V6 వెలుగు’ దినపత్రిక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన MLC వోటర్ సర్వే యొక్క ఫలితాలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులలో షేర్ చేసిన రెండు సర్వే ఫలితాలు ‘V6 వెలుగు’ దినపత్రిక నిర్వహించినవి కావు. ‘వెలుగు’ సర్వే పేరుతో అధికార పార్టీకి అనుకూలంగా తప్పుడు పోస్టులని షేర్ చేస్తున్నట్టు V6 ఛానల్ తెలిపింది. తెలంగాణలో జరిగిన MLC ఎన్నికలకు సంబంధించి ‘వెలుగు’ దినపత్రిక ఎటువంటి సర్వే నిర్వహించలేదని V6 న్యూస్ ఛానల్ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ సర్వే లకు సంబంధించిన సమాచారం కోసం V6 న్యూస్ అధికారిక వెబ్సైటులో మరియు సోషల్ మీడియా అకౌంట్లలలో వెతికితే, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ సర్వే గురించి V6 న్యూస్ ఛానల్ స్పష్టతనిస్తూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో ‘వెలుగు’ పేరుతో ఫేక్ సర్వే ఫలితాలు షేర్ చేస్తునట్టు V6 న్యూస్ ఛానల్ తెలిపింది. తెలంగాణలో జరిగిన రెండు MLC స్థానాల ఎన్నికలకు సంబంధించి తాము ఎటువంటి సర్వేలు నిర్వహించలేదని V6 ఛానల్ స్పష్టం చేసింది. ఈ ఫేక్ సర్వే లపై V6 ఛానల్ తెలిపిన సమాచారాన్ని యూట్యూబ్ లో కూడా చూడవచ్చు.

 ‘V6 వెలుగు’ ఈ ఫేక్ సర్వే ల గురించి తెలుపుతూ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. అధికార పార్టికి చెందిన కొందరు ‘వెలుగు’ పేరుతో తప్పుడు సర్వేలని సృష్టించినట్టు V6 న్యూస్ ఛానల్ ఆరోపించింది. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడా ‘వెలుగు’ పేరుతో ఇలాంటి ఫేక్ సర్వే లనే సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు V6 ఛానల్ తెలిపింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులలో షేర్ చేసిన సర్వే ఫలితాలు ‘V6 వెలుగు’ ప్రకటించలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, తెలంగాణ MLC ఎన్నికలకు సంబంధించి ‘V6 వెలుగు’ దినపత్రిక ఎటువంటి సర్వే నిర్వహించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll