Fake News, Telugu
 

అయోధ్య దీపోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 133 కోట్ల రూపాయులు ఖర్చు చేసిందని వస్తున్న వార్తలు తప్పు

1

అయోధ్య లో నిర్వహించిన దీపోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు 133 కోట్ల రూపాయులు ఖర్చు చేసిందని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్య దీపోత్సవానికి 133 కోట్ల రూపాయులు ఖర్చు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): అయోధ్య దీపోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన అంచనా సుమారు 1.33 కోట్ల రూపాయులు మాత్రమే, 133 కోట్లు కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, అదే విషయాన్ని ప్రముఖ వార్తాసంస్థలు [ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్డ్),  న్యూస్18 (ఆర్కైవ్డ్), ఈనాడు (ఆర్కైవ్డ్), టీవీ5 (ఆర్కైవ్డ్), వన్ ఇండియా తెలుగు (ఆర్కైవ్డ్) మరియు మైక్ టీవీ  (ఆర్కైవ్డ్)] కూడా ప్రచురించాయని తెలుస్తుంది.

అయితే, ఒక జర్నలిస్ట్ మాత్రం సుమారు 1.33 కోట్ల రూపాయులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య దీపోత్సవానికి కేటాయించిందని తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ప్రెస్ రిలీజ్ ఫోటోని ట్వీట్ చేసాడు.

ఆ ప్రెస్ రిలీజ్ కోసం ఉత్తరప్రదేశ్ అధికారిక వెబ్ సైట్ లో వెతకగా, అక్టోబర్ 22న ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో దీపోత్సవానికి కేటాయించిన డబ్బు వివరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రెస్ రిలీజ్ ద్వారా 2019 సంవత్సరంలో నిర్వహిస్తున్న ప్రోగ్రాం కి సుమారు 132.70 లక్షలు (సుమారు 1.33 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలుస్తుంది. కావున, అయోధ్య దీపోత్సవానికి అయిన ఖర్చు 133 కోట్లు కాదు.

అంతేకాదు, గత సంవత్సరం బడ్జెట్ లో అయోధ్య దీపోత్సవానికి 50 లక్షలు అంచనా వేసి, తర్వాత సవరించి ఆ అంచనాను 46 లక్షలకు తగ్గించినట్టుగా ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్ బడ్జెట్ లో పర్యాటక విభాగంకి సంబంధించిన వివరాలలో చూడవొచ్చు. అలానే, ఈ సంవత్సరపు అయోధ్య దీపోత్సవానికి బడ్జెట్ లో సుమారు 100 లక్షల (ఒక కోటి) రుపాయుల అంచనా వేసినట్టు చూడవొచ్చు.

చివరగా, అయోధ్య దీపోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 133 కోట్ల రూపాయులు ఖర్చు చేసిందని వస్తున్న వార్తలు తప్పు

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll