Fake News, Telugu
 

‘తమిళనాడులో జరిగే జల్లికట్టు ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా హాజరుకానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

1

తమిళనాడులో 2020 జనవరిలో జరిగే జల్లికట్టు ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నాడంటూ ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. అది ఎంత వరకు వాస్తవమో చూదాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తమిళనాడులో 2020 జనవరిలో జరిగే జల్లికట్టు ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నారు.

ఫాక్ట్ (నిజం): రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీతో పాటు తమిళనాడు సందర్శించి, ‘జల్లికట్టు’ క్రీడని చూడబోతున్నట్లుగా మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాస్తవానికి అలాంటి కార్యక్రమం ఏదీ షెడ్యూల్ అవ్వలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గుజరాత్ ఆఫీస్ తెలిపింది . కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘జల్లికట్టు చూసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్’ అని వెతకగా, ప్రముఖ వార్తాసంస్థలు [టీవీ9 (ఆర్కైవ్డ్), ఈనాడు (ఆర్కైవ్డ్), ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్డ్), ఆంధ్రప్రభ (ఆర్కైవ్డ్), ప్రజాశక్తి (ఆర్కైవ్డ్), వన్ఇండియా తెలుగు (ఆర్కైవ్డ్), మనతెలంగాణ (ఆర్కైవ్డ్)  మరియు ap7am (ఆర్కైవ్డ్)] కూడా అదే విషయాన్ని ప్రచురించినట్టుగా చూడవొచ్చు.

కానీ, ‘ANI’ వార్తా సంస్థ వారు ఒక ట్వీట్ ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీతో పాటు తమిళనాడు సందర్శించి, ‘జల్లికట్టు’ క్రీడని చూడబోతున్నట్లుగా మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాస్తవానికి అలాంటి కార్యక్రమం ఏదీ షెడ్యూల్ అవ్వలేదని తెలిపింది.

ఇదే విషయాన్నీ ధృవీకరిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గుజరాత్ ఆఫీస్ వారు ఒక ట్వీట్ కూడా చేసారు.

చివరగా, ‘తమిళనాడులో జరిగే జల్లికట్టు ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా హాజరుకానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll