Fake News, Telugu
 

కంప్యూటర్ లో చేసిన ఫైర్ వర్క్స్ వీడియోని ముంబై లో జరిగినట్టు గా షేర్ చేస్తున్నారు

1

వెస్ట్ ముంబై లోని బోరివలి లో దీపావళి సందర్భంగా ఫైర్ వర్క్స్ షో చేసారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియా లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజం ఉందో కనుక్కుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వెస్ట్ ముంబై లోని బోరివలి లో జరిగిన ఫైర్ వర్క్స్ కి సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో చూపించిన ఫైర్ వర్క్స్ నిజంగా జరిగింది కాదు, కంప్యూటర్ ఉపయోగించి ఆ వీడియో తయారు చేసారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.  

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా దానికి సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ లభించాయి. ఆ వివరాల ప్రకారం, ఆ వీడియో వివిధ వర్షన్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడాన్ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియో గురించి వివరాలు తెలుసుకునే క్రమంలోనే, ‘MediaByJJ’ అనే యూట్యూబ్ ఛానల్ అదే వీడియోని 2013లో అప్ లోడ్ చేసింది అని తెలిసింది.

ఆ వీడియో కింద  ఉన్న కథనం ప్రకారం ఆ వీడియో అప్లోడ్ చేసిన వాళ్లే ఆ ఫైర్ వర్క్స్ క్రియేట్ చేసారని, ‘Heart of courage’ అనే పాటని కూడా ‘Fwism‘ అనే సాఫ్ట్ వేర్ టూల్ ని ఉపయోగించి ఆ వీడియోతో జత పరిచినట్టు తెలుస్తుంది. కావున, వీడియో లో కనిపించే ఫైర్ వర్క్స్ నిజంగా జరగలేదు, అది కంప్యూటర్ ద్వారా చేయబడింది.

చివరగా, ముంబయి లో జరిగినట్టు చూపిస్తున్న ఆ ఫైర్ వర్క్స్ వీడియో కంప్యూటర్ ద్వారా చేయబడింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll