Fake News, Telugu
 

పోలీసులు ఆ యువకులను కొట్టింది హెల్మెట్ పెట్టుకోనందుకు కాదు

0

స్టేషన్ లో ఇద్దరు యువకులను పోలీసులు కొడ్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, వారు ద్విచక్ర వాహనం నడుపుతున్నపుడు హెల్మెట్ పెట్టుకోనందుకు పోలీసులు కొడుతున్నారని ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : వీడియో లో పోలీసులు యువకులను హెల్మెట్ పెట్టుకోనందుకు కొడ్తున్నారు. 

ఫాక్ట్ (నిజం): ఒక కాలేజీ యువతిని ఈవ్ టీజింగ్ చేసినందుకు యువకులను పోలీసులు కొట్టారు. కావున, పోస్టులో చేసిన ఆరోపణ తప్పు. 

పోస్టులో పెట్టిన వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్ చేసినప్పుడు, దానికి సంబంధించిన చాలా కీఫ్రేమ్స్ వచ్చాయి. వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక కీఫ్రేమ్ “Daiji World” అనే వార్త సంస్థ జూన్ 23న ప్రచురించిన ఒక కథనం లో లభించింది. దాని ప్రకారం ఒక కాలేజీ ప్రిన్సిపాల్ తమ విదార్ధిని తో ఇద్దరు యువకులు తప్పుగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఆ యువకులను స్టేషన్ కి తీసుకువెళ్లి కొట్టారు.

ఆ వీడియో ఆధారంగా “My Nation” వార్తా సంస్థ వారు ప్రచురించిన కథనం ఇక్కడ చూడవచ్చు. అదే సంఘటన గురించి “Deccan Herald” వారు రాసిన కథనం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పోలీసులు ఆ యువకులను కొడ్తున్నది హెల్మెట్ పెట్టుకోనందుకు కాదు. ఒక అమ్మాయిని ఈవ్ టీసింగ్ చేసినందుకుగాను కొట్టారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll