Fake News, Telugu
 

సంబంధం లేని వీడియోని కేరళలోని PFI ఆఫీసులపై ED రైడ్ నిర్వహించి భారీ నగదు స్వాధీనం చేసుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కేరళ రాష్ట్రంలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ఆఫీసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు సోదాలు నిర్వహించి పట్టుబడ్డ నల్ల ధనాన్ని లెక్కిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: కేరళ రాష్ట్రంలోని PFI ఆఫీసుపై ED మరియు NIA అధికారులు సోదాలు నిర్వహించి భారీ నగదుని స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు. 

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, ED అధికారులు ఇటీవల కోల్‌కతా నగరంలో అమీర్ ఖాన్ అనే మొబైల్ గేమింగ్ వ్యాపారి నివాసాలపై రైడ్ నిర్వహించి భారీ నగదుని స్వాధీనం చేసుకున్న దృశ్యాలని చూపిస్తుంది. కేరళ మరియు ఇతర రాష్ట్రాలలోని PFI ఆఫీసులపై ED మరియు NIA అధికారులు ఇటీవల  రైడ్స్ నిర్వహించిన మాట వాస్తవం. కానీ, పోస్టులో షేర్ చేసీన వీడియోకి PFI ఆఫీసులపై జరిగిన రైడ్లకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NDTV’ వార్తా సంస్థ 11 సెప్టెంబర్ 2022 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ‘E-Nuggets’ మొబైల్ గేమింగ్ యాప్‌ను ప్రోమోట్ చేస్తున్న అమీర్ ఖాన్ అనే కోల్‌కతా వ్యాపారి నివాసాలపై ED సోదాలు నిర్వహించి భారీ నగదుని స్వాధీనం చేసుకున్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

కోల్‌కతా నగరంలో అమీర్ ఖాన్‌కు సంబంధించిన ఆరు నివాసాలపై ED సోదాలు నిర్వహించి 17 నుండి 18 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

కేరళ, కోల్‌కతా మరియు ఇతర రాష్ట్రాలలోని PFI ఆఫీసులపై ED మరియు NIA అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. PFI ఇస్తున్న శిక్షణ మరియు వారికి వస్తున్న నిధుల గురించి దర్యాప్తులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలలోని PFI ఆఫీసులపై రైడ్లు నిర్వహించినట్టు అధికారులు మీడియాకి తెలిపారు. కాని, పోస్టులో షేర్ చేసీన వీడియోకి PFI ఆఫీసులపై జరిగిన రైడ్లకు ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, కోలకతా వ్యాపారిపై ఇటీవల ED జరిపిన రైడ్‌కు సంబంధించిన వీడియోని కేరళలోని PFI ఆఫీసులపై ED రైడ్ నిర్వహించి భారీ నగదు స్వాధీనం చేసుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll