Fake News, Telugu
 

సంబంధంలేని ఫోటోలని ద్వారక నగరంలో దాగి ఉన్న రహస్య సొరంగాలని షేర్ చేస్తున్నారు

0

ద్వారక నగరంలో దాగి ఉన్న రహస్య సొరంగాల ఫోటోలు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఈ సొరంగాలలోకి  వెళ్ళిన వ్యక్తులెవరూ బయటికి రాలేదని, ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ వుడ్ ఈ సొరంగాల గురించి తన పుస్తకంలో రాసినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ద్వారక నగరంలో దాగి ఉన్న రహస్య సొరంగాల ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన మొదటి సొరంగం ఫోటోని Bakya అనే గ్రాఫిక్ డిజైనర్ రూపొందించారు. రెండో ఫోటోలో కనిపిస్తున్నది మోంటెనెగ్రో దేశంలోని కమేనోవో బీచ్ నుండి రాఫైలోవిసి అనే గ్రామం మధ్యలో నిర్మించిన సొరంగం. జాన్ వుడ్ అనే రచయిత ద్వారక నగరానికి సంబంధించి పుస్తకం పబ్లిష్ చేసినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఇమేజ్ ‘DeviantArt’ అనే ఆర్ట్ కమ్యూనిటీ వెబ్సైటులో దొరికింది. ఈ ఇమేజ్ ని Batkya అనే గ్రాఫిక్ డిసైనర్ రూపొందించినట్టు ఈ వెబ్సైటులో తెలిపారు. ఈ ఫోటో ‘Behance’ ఇమేజ్ షేరింగ్ వెబ్సైటులో కూడా పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

రష్యా దేశానికి చెందిన Batkya (అసలు పేరు Sergey Likhachev), ‘Lost City’ ఆల్బంలో భాగంగా ఈ ఇమేజ్ ని రూపొందించారు. ఈ ఇమేజ్ ని తయారు చేసిన ప్రక్రియని Batkya తన యూట్యూబ్ చానెల్లో షేర్ చేసాడు. ఈ వీడియోని ‘Creative Media’ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో గాఫిక్ డిజైన్ ద్వార రూపొందించింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2:

ఈ సొరంగం ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే సొరంగం ఫోటోని షేర్ చేస్తూ పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ దొరికింది. మోంటెనెగ్రో దేశంలోని Kamenovo బీచ్ నుండి Rafailovici అనే గ్రామానికి యాత్రికులు నడవడానికి ఈ సొరంగం నిర్మించినట్టు ఆర్టికల్ తెలిపింది. ఈ ఫోటోని ఇదే వివరణతో మరొక ఆర్టికల్ పబ్లిష్ చేసారు.

Trip Advisor’ వెబ్సైటులో కూడా ఈ సొరంగం కమేనోవో బీచ్ నుండి రాఫైలోవిసి గ్రామం మధ్యలో నిర్మించినది అని తెలిపారు. ఈ సొరంగం ఫోటోని Alamy, Shutter Stock వెబ్సైటులో ఇదే వివరణతో షేర్ చేసారు.ఈ సొరంగం ఫోటో Google Maps లో కూడా లభించింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ద్వారక నగరానికి సంబంధించి కాదు అని చెప్పవచ్చు.

జాన్ వుడ్ అనే ఇంగ్లాండ్ కి చెందిన రచయిత, ద్వారక నగరానికి సంబంధించిన రహస్యాలు తెలుపుతూ “Unsolved and Dangerous Mysteries” అనే పుస్తకం పబ్లిష్ చేసినట్టు ఎక్కడ ఆధారాలు దొరకలేదు.

చివరగా, సంబంధం లేని సొరంగాల ఫోటోలని చూపిస్తూ ద్వారక నగరంలో దాగి ఉన్న రహస్య సోరంగాల ఫోటోలని  షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll