Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోని ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ లోని మదర్సాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలని షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ నగరంలోని మదర్సాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ఫోటో, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు మదర్సా పై నిర్వహించిన ఈ రైడ్ లో నిమిషానికి ఎనిమిది వేల రౌండ్లు కాల్చగలిగే ఎల్‌ఎమ్‌జి మెషిన్ గన్ పట్టుబడినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. అంతేకాదు, పోలీసులు ఆ మదర్సాను నడిపిస్తున్న ఆరుగురు (6) మతాధికారులను అరెస్ట్ చేసినట్టు ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ నగరంలోని మదర్సాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలుపుతున్న ఘటన జూలై 2019లో చోటుచేసుకుంది. 2019లో ఉత్తరప్రదేశ్ పోలీసులు బిజ్నోర్ లోని దారుల్ ఖురాన్ హమిదియా మదర్సా పై నిర్వహించిన రైడ్ లో మూడు నాటు తుపాకులు, 32 బుల్లెట్ల పిస్టోల్స్ మరియు పెద్ద సంఖ్యలో బుల్లెట్లని స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్ లో ఎల్‌ఎమ్‌జి మెషిన్ గన్ పట్టుబడలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో, పంజాబ్ రాష్ట్రం పటియాల నగరంలోని ఒక కత్తి కర్మాగారానికి సంబంధించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.   

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం కీ పదాలు ఉపయోగించి గూగల్ లో వెతికితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ నగరంలోని మదర్సా పై పోలీసులు జూలై 2019లో రైడ్ నిర్వహించినట్టు తెలిసింది. బిజ్నోర్ నగరం శేర్కోట్ ప్రాంతంలోని దారుల్ ఖురాన్ హమిదియా మదర్సా పై పోలీసులు రైడ్ నిర్వహించి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఈ రైడ్ లో మూడు నాటు తుపాకులు, 32 కాలిబెర్ల  రెండు పిస్టోల్స్ మరియు పెద్ద సంఖ్యలో బుల్లెట్లని స్వాధీనం చేసుకున్నట్టు ఈ ఆర్టికల్స్ లో రిపోర్ట్ చేసారు. ఈ రైడ్ కు సంబంధించి ‘ANI’ పెట్టిన ట్వీట్ ని ఇక్కడ చూడవచ్చు.

బిజ్నూరు నగరం శేర్కోట్ ప్రాంతంలోని హమిదియా మదర్సాలో తాము స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి తెలుపుతూ బిజ్నోర్ పోలీసులు 11 జూలై 2019 నాడు ట్వీట్ పెట్టారు.  ఈ రైడ్ లో అయిదు చట్ట విరుద్ధమైన  పిస్టోల్స్ ని స్వాధీనం చేసుకున్నట్టు  బిజ్నోర్ పోలీసులు తెలిపారు.  ఈ ఆయుధాలని అక్రమ రవాణ చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తమ ట్వీట్ లో తెలిపారు. మదర్సా పై నిర్వహించిన ఈ రైడ్ లో ఎల్‌ఎమ్‌జి మెషిన్ గన్ పట్టుబడినట్టు బిజ్నోర్ పోలీసులు ఎక్కడా తెలుపలేదు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘India Today’ న్యూస్ వెబ్సైటు 2018లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటో, పంజాబ్ రాష్ట్రం పటియాల నగరంలోని ఒక కత్తుల కర్మాగారానికి సంబంధించిందని ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఇదివరకు, ఇదే ఫోటోని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన నిరసనకు ముడిపెడితే, దానికి సంబంధించి FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సంబంధం లేని ఫోటోని ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ లోని మదర్సాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల దృశ్యమని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll