Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని ఇజ్రాయిల్ సైన్యంపై దాడి చేస్తుండగా ఆయుధం పేలి మరణించిన పాలస్తీనా మిలిటెంట్ అని షేర్ చేస్తున్నారు

0

ఇజ్రాయిల్ సైన్యంపై బాంబులను ప్రయోగిస్తుండగా ప్రమాదవశాత్తూ మోర్టార్ పేలి పాలస్తీనా మిలిటెంట్ మరణించిన ఇటీవల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: ఇజ్రాయిల్ సైన్యంపై బాంబులను ప్రయోగిస్తుండగా ప్రమాదవశాత్తూ మోర్టార్ పేలి పాలస్తీనా మిలిటెంట్ మరణించిన ఇటీవలి దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కనీసం 2007 నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతోంది. ఇరాకీ తిరుగుబాటుదారుడు మోర్టార్ షెల్స్‌లను ప్రయోగిస్తుండగా ప్రమాదవశాత్తు మోర్టార్ పేలిపోయిన దృశ్యాలంటూ ఈ వీడియోని పలు వార్తా సంస్థలు 2007లోనే షేర్ చేశాయి. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ప్రస్తుత ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలను కనీసం 2007 నుండి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఇరాకీ తిరుగుబాటుదారుడు అమెరికా సైన్యంపై బాంబులు ప్రయోగిస్తుండగా ప్రమాదవశాత్తు మోర్టార్ పేలి మరణించిన దృశ్యాలంటూ ఈ వీడియోని పలు సంస్థలు 2007లోనే రిపోర్ట్ చేశాయి. ఆ వార్తా రిపోర్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియోలోని స్క్రీన్ గ్రాబ్‌లను షేర్ చేస్తూ గతంలో పలు ప్రముఖ వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ మోర్టార్లను లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆయుధం పేలిన దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థలు గతంలో రిపోర్ట్ చేశాయి. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, ప్రస్తుత ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధానికి సంబంధించినది కాదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని ఇజ్రాయిల్ సైన్యంపై దాడి చేస్తుండగా ఆయుధం పేలి పాలస్తీనా మిలిటెంట్ మరణించిన ఇటీవలి దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll