Fake News, Telugu
 

ముస్లిం మహిళలు బీజేపీ కండువా వేసుకొని ఉన్న ఈ ఫోటోలు తెలంగాణలో తీసినవి కావు

0

‘బీజేపీ ని నమ్ముకున్న భారతీయ మహిళలు; GHMC ఎన్నికల మీటింగ్ లలో స్వచ్చందంగా పాల్గొన్న ముస్లిం మహిళలు’ అని మరియు ‘BJP లోకి పాతబస్తీ ముస్లిం మహిళలు’ అని చెప్తూ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: GHMC ఎన్నికల సందర్భంగా బీజేపీ మీటింగ్లలో పాల్గొన్న ముస్లిం మహిళల ఫోటోలు.

ఫాక్ట్: పోస్టుల్లోని ఫోటోలు GHMC ఎన్నికలకు సంబంధించినవి కావు. అసలు అవి తెలంగాణ లో తీసిన ఫోటోలే కావు. ఒక ఫోటో కర్ణాటక కి సంబంధించినది; మరొకటి వారణాసి (యూపీ) కి సంబంధించినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటో 1: (ఆర్కైవ్డ్)

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని అస్సాం బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ 2018 లో ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. 2018 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన మీటింగ్ కి సంబంధించిన ఫోటో అని తన ట్వీట్ లో హిమంత బిస్వా రాసాడు. అదే విషయం చెప్తూ బీజేపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ వారు కూడా పోస్ట్ లోని ఫోటోని మే 2018 లో ట్వీట్ చేసారు. కావున, పోస్ట్ లోని ఫోటో GHMC ఎన్నికలకు సంబంధించింది కాదు.

ఫోటో 2: (ఆర్కైవ్డ్)

ఈ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, పలు వార్తాసంస్థలు ఇదే ఫోటోని పెట్టి 2018 లో ఆర్టికల్స్ ప్రచురించినట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీ నియోజికవర్గం అయిన వారణాసి లో అక్టోబర్ 2018 లో ముస్లిం మహిళలు బీజేపీ లో చేరినప్పుడు తీసిన ఫోటో అది. ఆ ఫోటోకి సంబంధించి వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. అంతేకాదు, ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు. కావున, ఈ ఫోటో కూడా GHMC ఎన్నికలకు సంబంధించింది కాదు.

ఇంకో వీడియోని (ఆర్కైవ్డ్) కూడా కొంత మంది సోషల్ మీడియాలో పెట్టి, ‘పాతబస్తి లో భారీగా BJP పార్టీ లో చేరిన ముస్లిం సోదరీమణులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జైశ్రీరామ్ భారత్ మాతా కీ జై అంటు నినదిస్తు అంతటా ప్రచారంలో పాల్గొంటున్నారు’ అని షేర్ చేస్తున్నారు

అయితే, ఈ వీడియో ఎక్కడిదో కచ్చితమైన సమాచారం దొరకలేదు. కానీ, కనీసం డిసెంబర్ 2018 నుండి ఇంటర్నట్ లో షేర్ అవుతున్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ముస్లిం మహిళలు బీజేపీ కండువా వేసుకొని ఉన్న ఈ ఫోటోలు GHMC ఎన్నికలకు సంబంధించినవి కావు. అసలు అవి తెలంగాణ లో తీసిన ఫోటోలే కావు.

Share.

About Author

Comments are closed.

scroll