విలయతాండవం చేస్తున్న నివర్ తుఫాన్ అని చెప్తూ, రెండు వీడియోలను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: విలయతాండవం చేస్తున్న నివర్ తుఫాన్ యొక్క వీడియోలు.
ఫాక్ట్: ఒకటి సాఫ్ట్‌వేర్ సహాయంతో తయారు చేసిన సిములేషన్ వీడియో అయితే, మరొక వీడియో ఇంటర్నెట్ లో కనీసం 2017 నుండి షేర్ చేయబడుతుంది. ఆ రెండు వీడియోలు నివర్ తుఫాన్ కి సంబంధించినవి కావు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని కొందరు మే 2020 లోనే పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కావున, ఆ వీడియో నివర్ తుఫాన్ కి సంబంధించింది కాదు. అంతేకాదు, అలాంటి వీడియోనే 2018 లో ‘Alexandru Dineci’ అనే వ్యక్తి తన యూట్యూబ్ అకౌంట్ లో ‘Tornado CGI simulation (Cinema 4D TurbulenceFD)’ అనే టైటిల్ తో పోస్ట్ చేసాడు.
అది ఒక సాఫ్ట్‌వేర్ సహాయంతో తయారు చేసిన సిములేషన్ వీడియో అని చెప్తూ అతను తన అకౌంట్ మరో వీడియోని కూడా పోస్ట్ చేసాడు. కావున, ఆ వీడియోలో ఉన్నది అసలు నిజమైన తుఫాన్ కాదు.
ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని ఇంతకముందు వివిధ సందర్భాల్లో చాలా మంది షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వీడియో కనీసం 2017 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. వీడియో ఎక్కడ తీసారో కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, నివర్ తుఫాన్ కి సంబంధించినది మాత్రం కాదని చెప్పవొచ్చు.
చివరగా, సంబంధంలేని పాత వీడియోలను నివర్ తుఫాన్ యొక్క వీడియోలని తప్పుగా షేర్ చేస్తున్నారు.