Fake News, Telugu
 

పాత వీడియోని చూపిస్తూ నివర్ తుఫాను వల్ల చెన్నైలోని మరీనా బీచ్ మునిగిపోయిందని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

బీచ్ మరియు దాని పక్కనున్న రోడ్లు మొత్తం నీటిలో మునిగిపోయిన వీడియోని చూపిస్తూ ఇది చెన్నైలోని మరీనా బీచ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి అని చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నివర్ తుఫాను కారణంగా చెన్నై లోని మరీనా బీచ్ మరియు దాని పక్కనున్న రోడ్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో యూట్యూబ్ లో 2017 నుండే ఉంది. చాలా వెరిఫైడ్ యూట్యూబ్ చానల్స్ మరియు లోకల్ తమిళ్ న్యూస్ ఛానల్ ఈ వీడియోని 2017లో చెన్నైలో వరదలు సంభవించినప్పుడు మరీనా బీచ్ మొత్తం వరద నీటిలో మునిగిపోయిందని చెప్తూ షేర్ చేసాయి. వీటన్నిటి బట్టి ఈ వీడియో 2017లో చెన్నై సంభవించిన వరదలకు సంబంధించిందని చెప్పడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారం దొరకనప్పటికి, ఈ వీడియో ప్రస్తుత నివర్ తుఫానుకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

యూట్యూబ్ లో ‘Chennai marina beach floods’ అనే కీవర్డ్ తో సెర్చ్ చేయగా పోస్టులో ఉన్న వీడియోని పోలిన విజువల్స్ ప్రచురించిన ఒక లోకల్ తమిళ్ న్యూస్ వీడియో కనిపించింది. ఈ వీడియో ప్రకారం ఈ విజువల్స్ 2017లో చెన్నైలో వరదలు సంభవించినప్పుడు మరీనా బీచ్ మొత్తం వరద నీటిలో మునిగిపోయిన ఘటనకి సంబంధించినవి.

2017లో చెన్నైలో వరదలు సంభవించినప్పుడు మరీనా బీచ్ మొత్తం వరద నీటిలో మునిగిపోయిందని చెప్తూ మరికొన్ని వెరిఫైడ్ యూట్యూబ్ చానల్స్ కూడా ఇదే వీడియోని తమ చానల్స్ లో షేర్ చేసాయి. ఈ వీడియోస్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. అలాగే పోస్టులో ఉన్న వీడియోలాంటివే చాలా వీడియోలు యూట్యూబ్ లో కనీసం మూడు సంవత్సరాల ముందు అప్లోడ్ చేయబడి ఉన్నాయి.

యూట్యూబ్ వీడియోస్ ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా 2017లో చెన్నైలో సంభవించిన వరదలకు సంబంధించిన వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాలలో వరద నీటిలో మునిగిపోయిన మరీనా బీచ్ మరియు రోడ్లు చూడొచ్చు. ఈ వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

వీటన్నిటి ఆధారంగా పోస్టులో ఉన్న వీడియో ఇప్పుడు నివర్ తుఫాను వల్ల కురుస్తున్న వర్షాలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. ఐతే ఈ వీడియో 2017లో చెన్నైలో సంభవించిన వరదలకు సంబంధించిందని చెప్పడానికి కూడా మాకు కచ్చితమైన ఆధారం లభించలేదు.

చివరగా, పాత వీడియోని చూపిస్తూ నివర్ తుఫాను వల్ల చెన్నైలోని మరీనా బీచ్ మునిగిపోయిందని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll