Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి, ‘కేరళలో CAA ,NRC కి మద్దతుగా బీజేపీ నిర్వహించిన ర్యాలీ వీడియో’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఖాళీగా ఉన్న ఒక మీటింగ్ వీడియో పెట్టి, ‘కేరళలో CAA ,NRC కి మద్దతుగా బీజేపీ ర్యాలీ.. భారీగా తరలివచ్చిన జన సునామీ… కోట్ల సంఖ్యలో జనం రోడ్లపై రావడంతో కొన్ని కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్’ అని వ్యంగ్యంగా కొందరు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలో CAA ,NRC కి మద్దతుగా బీజేపీ నిర్వహించిన ర్యాలీ వీడియో. 

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియో అక్టోబర్-2019 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, వీడియోలో ఎక్కడ కూడా CAA మరియు NRC గురించి తను మాట్లాడడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని ఒకరు అక్టోబర్-2019 లోనే ట్విట్టర్ లో ట్వీట్ చేసినట్టుగా చూడవొచ్చు. మరొక వ్యక్తి కూడా అదే వీడియోని అక్టోబర్-2019 లో ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, వీడియోలో ఎక్కడ కూడా CAA మరియు NRC గురించి తను మాట్లాడాడు. CAA మరియు NRC కి మద్దతుగా లేదా నిరసనగా ర్యాలీలు నిర్వహించడం డిసెంబర్-2019 లో మొదలయ్యాయి.

చివరగా, పాత వీడియో పెట్టి, ‘కేరళలో CAA ,NRC కి మద్దతుగా బీజేపీ నిర్వహించిన ర్యాలీ వీడియో’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll