Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియోలను తౌతే తుఫాన్ పేరుతో షేర్ చేస్తున్నారు

0

తౌతే తుఫాన్ కారణంగా కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు వెస్ట్ కోస్ట్ లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇలాంటి తుఫాన్ కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఇవి గుజరాత్ మరియు ముంబైలో తౌతే తుఫాన్ కి సంబంధించినవని చెప్తున్న పోస్టులు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ ) సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకి సంబంధించిన తౌతే తుఫాన్ వీడియోలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలలో కొన్ని ముంబై మరియు హైదరాబాద్ లో 2020 మరియు 2018లో కురిసిన వర్షాలకు సంబంధించినవి కాగా మరొకటి 2020లో సౌదీలోని మదీనాలో వర్షం కారణంగా బాల్కనీ కూలి పార్కింగ్ లోని కార్లపై పడిన ఘటనది. ఈ వీడియోలకు తౌతే తుఫాన్ కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియో 1:

ఈ వీడియో ఆగస్టు 2020 ముంబైలో సంభవించిన వరదలకు సంబంధించింది. ఈ వీడియో గురించిన మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. అలాంటి ఒక కథనం లో ముంబైలో బలమైన గాలులకు కొబ్బరి చెట్టు ఊగుతుందని చెప్తూ ఈ వీడియోని షేర్ చేసారు.

ఈ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రచురించిన మరికొన్ని ఆగస్టు 2020 వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాలు కూడా ఈ వీడియో ఆగస్టు 2020 సంభవించిన వరదలకు సంబంధించిందని ద్రువీకరిస్తున్నాయి.

వీడియో 2:

ఈ వీడియో కి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా ఇదే వీడియోని ప్రచురించిన 03 మే 2018 నాటి  వార్తా కథనం ఒకటి మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో మే 2018లో హైదరాబాద్ లో కురిసిన వర్షానికి సంబంధించిందని స్పష్టంగా అర్థమవుతుంది.

వీడియో 3:

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని జూలై 2020లో ప్రచురించిన ఒక అరబిక్ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో మదీనాలో వర్షాల కారణంగా ఒక బిల్డింగ్ బాల్కనీ కూలి కింద ఉన్న కార్లపై పడిన సంఘటనకి సంబంధించింది.

ఈ ఘటనకి సంబంధించిన వార్తని 2020లో ప్రచురించిన మరొక కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం కూడా ఈ ఘటన సౌదీలోని మదీనా ప్రాంతంలో జరిగిందంటూ ద్రువీకరిస్తుంది.

చివరగా, సంబంధంలేని పాత వీడియోలను తౌతే తుఫాన్ పేరుతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll