Fake News, Telugu
 

అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌లోని శిల్పాలని ఇండోనేషియా సముద్ర గర్భంలో కనుగొన్న 5000 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయ దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఇండోనేషియాలోని పెముటేరన్ సముద్రంలో ఈత కొడుతూ బెంటర్ అనే ఒక గజ ఈతగాడు సముద్రం అడుగున 5000 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయాన్ని కనుగొన్నాడంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇండోనేషియాలోని పెముటేరన్ సముద్రంలో ఈత కొడుతూ బెంటర్ అనే ఒక గజ ఈతగాడు సముద్రం అడుగున 5000 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయాన్ని కనిపెట్టాడు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, ఇండోనేసియా బాలి ప్రావిన్సులోని పెముటేరన్ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌లోని విగ్రహాలని చూపిస్తుంది. ఈ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌ని ‘సీ రోవర్ డైవ్ సెంటర్’ వ్యవస్థాపకుడు పాల్ టార్లీ 2005లో ‘రీఫ్ గార్డెనర్స్’ అనే కమ్యూనిటి ప్రొజెక్టులో భాగంగా కృత్రిమంగా నిర్మించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియోలో కనిపిస్తున్న సముద్రగర్భ శిలా అవశేషాలు, ఇండోనేసియా బాలి ప్రావిన్సులోని పెముటేరన్ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌లో ఉన్నట్టు తెలిసింది. ఈ శిలా అవశేషాలు పెముటేరన్ అండర్ వాటర్ గార్డెన్‌లోనివని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

పెముటేరన్ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌ని 2005లో ‘రీఫ్ గార్డెనర్స్’ అనే సోషల్/ఎకనామిక్ ప్రొజెక్టులో భాగంగా నిర్మించినట్టు ‘సీ రోవర్ డైవ్ సెంటర్’ వ్యవస్థాపకుడు పాల్ టార్లీ ఒక వీడియో వివరణలో స్పష్టం చేశారు. ఈ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌కు సంబంధించి మరింత స్పష్టతనిస్తూ పాల్ టార్లీ తన బ్లాగ్లో పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

ఈ కృత్రిమ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌ని 2005లో ‘రీఫ్ గార్డెనర్స్’ అనే కమ్యూనిటి ప్రాజెక్టులో భాగంగా నిర్మించినట్టు ఇండోనేషియా టూరిజం మంత్రుత్వ శాఖ తమ వెబ్సైట్లో తెలిపింది. ఇదివరకు, ఇవే చిత్రాలని ద్వారకా నగరంలో బయటబడ్డ శిల్పాలని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, Factly అది తప్పని స్పష్టం చేస్తూ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, పెముటేరన్ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌లోని శిల్పాలని ఇండోనేషియా సముద్ర గర్భంలో కనుగొన్న 5000 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయ దృశ్యాలంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll