Fake News, Telugu
 

దళిత బహుజనులని ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు

0

దళిత బహుజనులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దళిత బహుజనులు ప్రపంచంలోనే అత్యంత మేధస్సు కలిగిన వారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): దళిత బహుజనులు ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫోటోలో కనిపిస్తున్న ‘ETV Andhra Pradesh’ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఎడిట్ చేయబడినది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.   

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, దళిత బహుజనులు ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదని తెలిసింది. ఒక వేల ఐక్యరాజ్య సమితి నిజంగా అలాంటి ప్రకటన చేస్తే, దేశంలోని వార్తా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అలాంటి న్యూస్ ఎక్కడా రిపోర్ట్ కాలేదు.

పోస్టులో షేర్ చేసిన న్యూస్ బులెటిన్ కోసం ‘ETV Andhra Pradesh’ యూట్యూబ్ ఛానెల్లో వెతకగా, ఐక్యరాజ్య సమితి కి ముడిపెడుతూ ఇలాంటి వార్త ఏది ‘ETV Andhra Pradesh’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేయలేదని తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది అని చెప్పవచ్చు.

ఇదివరకు, ఐక్యరాజ్య సమితి విశ్వబ్రాహ్మణులని ప్రపంచంలోని అత్యంత మేధావులుగా ప్రకటించిందని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, దానికి సంబంధించి FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, దళిత బహుజనులని ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll