Fake News, Telugu
 

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారని ఉదయనిధి స్టాలిన్ అనలేదు

0

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ గారిని ఓడించలేదు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారు”, అని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ చేస్తున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.

ఫాక్ట్ (నిజం): ఉదయనిధి స్టాలిన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి గానీ, కేసీఆర్‌కు సంబంధించి గాని అటువంటి వ్యాఖ్యలేవీ ఇటీవల చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఉదయనిధి స్టాలిన్ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి గానీ, కేసీఆర్‌కు సంబంధించి గానీ అటువంటి వ్యాఖ్యలేవీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ట్వీట్ లేదా పోస్ట్ చేయలేదని తెలిసింది. ఒకవేళ ఉదయనిధి స్టాలిన్ కేసీఆర్‌కు సంబంధించి అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఆ విషయాన్ని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

తెలంగాణలో, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాలలో గెలిచిన రాజకీయ పార్టీలకు తమిళనాడు ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్ తండ్రి, ఎం.కే. స్టాలిన్ ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కానీ, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

చివరగా, తెలంగాణ ప్రజలుకేసీఆర్‌ను ఓడించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారని ఉదయనిధి స్టాలిన్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll