Fake News, Telugu
 

వీడియోలో కనపడేది నిజమైన రోబో కాదు, దానిని CGI టెక్నిక్ తో సృష్టించారు

0

ఒక వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి ‘ఇది ఫిల్మ్ ఫిక్షన్ కోసం చేసిన రోబో కాదు. ఇది నిజమైన యు.ఎస్ .డెల్టా ఫోర్స్ “రోబోట్” శిక్షణా పద్ధతి. సిరియాలో ఉగ్రవాది అల్ బాగ్దాదిని  చంపడానికి ఆపరేషన్ లో ఉపయోగించబడింది. ప్రత్యక్ష మందుగుండు సామగ్రితో డెమోలో పాల్గొనే ఈ సైనికులకు హ్యాట్స్ ఆఫ్. రోబోపై పూర్తి నమ్మకం … AI, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి … టెక్నాలజీ భయానకంగా ఉంది’ అని ఆ వీడియో గురించి పోస్టు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజంమో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఐసిస్ చీఫ్ అల్ బాగ్దాది ని చంపడానికి ఉపయోగించిన రోబో యొక్క శిక్షణ వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనపడేది నిజమైన రోబో కాదు, దానిని CGI అనే
టెక్నిక్ తో సృష్టించారు. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.  

పోస్టులో పెట్టిన వీడియో గురించి ‘Robot Training’ అనే కీవర్డ్స్ తో యూట్యూబ్ లో వెతికినప్పుడు, అదే వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. దానిని ‘Corridor’ అనే యూట్యూబ్ ఛానెల్ ‘New Robot Makes Soldiers Obsolete (Bosstown Dynamics)’ అనే టైటిల్ తో అక్టోబర్ 26, 2019 న అప్లోడ్ చేశారని తెలిసింది. 

యూట్యూబ్ లో ‘Bosstown Dynamics’ అని వెతికినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ లో పైన వీడియో యొక్క మేకింగ్ వీడియో లభించింది. దానిని ‘Corridor Crew’ అనే యూట్యూబ్ ఛానెల్ ‘We Used CGi to Fake Military Robots’ అనే టైటిల్ తో అక్టోబర్ 27, 2019 న అప్లోడ్ చేశారు. కావున, వీడియోలో కనపడేది నిజమైన రోబో కాదు, దానిని CGI అనే టెక్నిక్ తో సృష్టించారు. 

చివరగా, వీడియోలో కనపడేది నిజమైన రోబో కాదు, దానిని CGI టెక్నిక్ తో సృష్టించారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll