శివుడి అర్చనాభిషేకం లో పాల్గొంటున్న పాము అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: శివుడి అర్చనాభిషేకం లో పాల్గొంటున్న పాము
ఫాక్ట్ (నిజం): అది ఒక ఎడిటెడ్ ఫోటో. పాము ఒరిజినల్ ఫోటోలో పాము ముందు శివుడి విగ్రహం ఉండదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని సరిగ్గా గమనిస్తే పాము చుట్టుపక్కల బ్లర్ గా ఉంటుంది.
కావున, ఫోటో నుండి కేవలం పాముని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటోలో పాముని పోలిన చాలా పాము ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఒక బ్లాగ్ లో పోస్ట్ చేసిన పాము ఫోటోలో అదే పాము అదే భంగిమలో ఉన్నట్టు చూడవొచ్చు. కానీ, ఆ ఫోటోలో పాము ముందు శివుడి విగ్రహం ఉండదు. అంటే, ఫోటోషాప్ సహాయంతో పాముని శివుడి ముందు పెట్టారు.
చివరగా, ఒక ఎడిటెడ్ ఫోటో పెట్టి, శివుడి అర్చనాభిషేకంలో పాము పాల్గొన్నట్టు ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఒక ఎడిటెడ్ ఫోటో పెట్టి, శివుడి అర్చనాభిషేకంలో పాము పాల్గొన్నట్టు ప్రచారం చేస్తున్నారు - Fact Checking Too