Fake News, Telugu
 

వీడియోలో ఉన్నది అబు ధాబి లోని ఎమిరేట్స్ పాలస్ హోటల్; హిందూ ఆలయం కాదు

0

అబు ధాబి లో సుల్తాన్ షేక్ మహ్మద్‌ నిర్మించిన హిందూ ఆలయం అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో తలపై రామాయణ కాపీతో ఆలయంలో అడుగుపెడుతున్నది సుల్తాన్ భార్య అని కూడా పోస్ట్ లో చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అబు ధాబి లో సుల్తాన్ షేక్ మహ్మద్‌ నిర్మించిన హిందూ ఆలయం వీడియో.

ఫాక్ట్: వీడియోలో ఉన్నది అబు ధాబి లోని ఎమిరేట్స్ పాలస్ హోటల్; హిందూ ఆలయం కాదు. అబు ధాబి లో BAPS హిందూ ఆలయం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అంతేకాదు, వీడియో లో తలపై రామకథ కాపీతో ఉన్నది సుల్తాన్ భార్య కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఒకరు అదే వీడియోని యూట్యూబ్ లో సెప్టెంబర్ 2016 లో పోస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఆ వీడియో టైటిల్ – ‘Morari Bapu – Abu Dhabi – Dubai’, అని ఉన్నట్టు చూడవొచ్చు. కీ-వర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతకగా, మొరారి బాపు కి సంబంధించిన వెబ్ సైట్ లో ఆ ఈవెంట్ 17-25 సెప్టెంబర్ 2016 మధ్య అబు ధాబి లో జరిగినట్టు తెలిసింది.

ఆ ఈవెంట్ మొదటి రోజు వీడియోని కూడా మొరారి బాపు కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లో చూడవొచ్చు. ఆ వీడియోలో పోస్ట్ లోని విజువల్స్ చూడవొచ్చు.

మొరారి బాపు ఈవెంట్ అబు ధాబి లోని ఎమిరేట్స్ పాలస్ హోటల్ లో జరిగినట్టు కొందరు చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, వీడియోలోని ప్రదేశాన్ని ఎమిరేట్స్ పాలస్ హోటల్ ఫోటోల్లో చూడవొచ్చు. కావున, వీడియోలో ఉన్నది అబు ధాబి లోని ఎమిరేట్స్ పాలస్ హోటల్; హిందూ ఆలయం కాదు.

ఆ ఈవెంట్ కి అబు ధాబి క్రౌన్ ప్రిన్స్ శ్రీ షేక్ మహ్మద్‌ బిన్ జాయ‌ద్ అల్ న‌హ్యాన్ హాజరు అయ్యాడని, ‘జై సియా రామ్’ అని అన్నాడని కొన్ని భారత మీడియా సంస్థలు ఒక వీడియోని 2018 లో  షేర్ చేయగా, అది ఒక ఫేక్ న్యూస్ అని ‘గల్ఫ్ న్యూస్’ వారు 2018 లో ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. ఆ ఈవెంట్ కి హాజరు అయింది సుల్తాన్ సూద్ అల్ కస్సేమి (‘a UAE-based columnist and commentator on Arab affairs’) అని, అబు ధాబి క్రౌన్ ప్రిన్స్ శ్రీ షేక్ మహ్మద్‌ బిన్ జాయ‌ద్ అల్ న‌హ్యాన్ కాదు అని ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. ఈ విషయం పై ‘UAE Embassy-Newdelhi’ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. 

అంతేకాదు, 2016 లో ‘ఏబీపీ న్యూస్’ ఛానల్ వారితో మొరారి బాపు మాట్లాడుతూ, ఆ వీడియో లో తలపై రామకథ కాపీతో ఉన్నది సుల్తాన్ భార్య కాదని తెలిపాడు. ఆ మహిళ పేరు సియా అని, తను నిర్వాహకుల కుటుంబానికి చెందిందని మొరారి బాపు చెప్పినట్టు వీడియోలో చూడవొచ్చు.

అబు ధాబి లో నిర్మిస్తున్న ఆలయం యొక్క వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, వీడియోలో ఉన్నది అబు ధాబి లోని ఎమిరేట్స్ పాలస్ హోటల్; హిందూ ఆలయం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll