బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా వివాహం నటుడు జహీర్ ఇక్బాల్‌తో జరిగిన సందర్భంగా, ‘పూర్వం లవ్ జిహాద్ విషయం పైన బిజేపీని విమర్శించిన శత్రుఘ్న సిన్హా ఇప్పుడు తన కూతురు లవ్ జిహాద్ బారిన పడినందుకు కన్నీరు పెట్టుకున్నారు’ అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు.
క్లెయిమ్: తన కూతురు సోనాక్షీ సిన్హా ముస్లిం నటుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకొని లవ్ జిహాద్ బారిన పడినందుకు శత్రుఘ్న సిన్హా కన్నీరు పెట్టుకున్నారు.
ఫాక్ట్(నిజం): వైరల్ పోస్టులో షేర్ చేసిన ఫోటో కలర్స్ టీవీలో 2022లో ప్రసారం చేసిన, రణవీర్ సింగ్ హోస్ట్ చేసిన ‘ది బిగ్ పిక్చర్’ అనే షో నుండి తీసిన స్క్రీన్ షాట్. ఈ షోలో సోనాక్షిని తొలిసారిగా తెరపై చూడటం గురించి మాట్లాడిన శతృఘ్న ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆమె తొలి చిత్రం దబాంగ్‌ని చూడటానికి కొన్నాళ్ల తర్వాత తాను థియేటర్‌కి వెళ్లానని, ‘ఒక స్టార్ పుట్టిందని’ భావించానని చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. పైగా, శతృఘ్న, ఈ వివాహాన్ని లవ్ జిహాద్ అంటూ నిరసనలు తెలుపుతున్న వారికి వ్యతిరేకంగా గట్టి స్టాండ్ తీసుకుని “నేను నిరసనకారులందరికీ ఒక్కటే చెప్తాను- మీ జీవితంలో ఉపయోగకరంగా ఏదైనా చేయండి. చెప్పడానికి ఇంకేమీ లేదు” అని తెలిపారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ పోస్టులో షేర్ చేసిన ఫోటోను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఇది కలర్స్ టీవీలో 2022లో ప్రసారం చేసిన, రణవీర్ సింగ్ హోస్ట్ చేసిన ది బిగ్ పిక్చర్ అనే షో నుండి తీసిన స్క్రీన్ షాట్ అని ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో ద్వారా తెలుసుకున్నాం (ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ షోలో సోనాక్షిని తొలిసారిగా తెరపై చూడటం గురించి మాట్లాడిన శతృఘ్న ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆమె తొలి చిత్రం దబాంగ్‌ని చూడటానికి కొన్నాళ్ల తర్వాత తాను థియేటర్‌కి వెళ్లానని, ‘ఒక స్టార్ పుట్టిందని’ భావించానని చెప్పాడు. “ఇప్పుడు ఆమె స్టార్‌డమ్ మరియు గ్లామర్‌కు అలవాటు పడి తన తల్లిదండ్రుల నుండి దూరం కాకూడదని నేను ఆశిస్తున్నాను, ”అని అతను చెప్పాడు. సోనాక్షి అతన్ని కౌగిలించుకుని, ఎప్పటికీ అలా జరగదని చెప్పింది. శతృఘ్న, ఇది తనకు గర్వకారణమని ఆయన కన్నీరు పెట్టాడు టీవీ షో యొక్క విజువల్స్ మరియు వైరల్ పోస్టు మద్య పోలికను కింద చూడవచ్చు.
వైరల్ పోస్టు గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఇటువంటి వార్త మాకు ఎక్కడా లభించలేదు. జహీర్ ఇక్బాల్‌తో తన కూతురు సోనాక్షి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సిన్హా స్వస్థలమైన బీహార్‌లోని పాట్నాలో హిందూ శివ భవానీ సేన అనేక నిరసనలు నిర్వహించింది. వారు వివాహాన్ని ‘లవ్ జిహాద్’ అని పేర్కొన్నారు, సోనాక్షిని ఇకపై ఆ స్థలాన్ని సందర్శించవద్దని కోరారు అని మీడియా రేపోర్ట్స్ ద్వారా కనుగొన్నాం. దీనికి శతృఘ్న, నిరసనలకు వ్యతిరేకంగా గట్టి స్టాండ్ తీసుకుని “నేను నిరసనకారులందరికీ ఒక్కటే చెప్తాను- మీ జీవితంలో ఉపయోగకరంగా ఏదైనా చేయండి. చెప్పడానికి ఇంకేమీ లేదు” అని తెలిపారు అని మీడియా ప్రచురించింది (ఇక్కడ మరియు ఇక్కడ).
చివరిగా, సోనాక్షి సిన్హా ముస్లిం నటుడు జహీర్ ఇక్బాల్‌ను ను వివాహం చేసుకున్నందుకు శత్రుఘ్న సిన్హా కన్నీరు పెట్టుకోలేదు.