Fake News, Telugu
 

ఈ వీడియో చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి కాకముందు క్రైస్తవ సమావేశానికి హాజరైనప్పటిది

0

పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ‘హల్లెలూయా’ అని ప్రభువును స్తుతించాడని చెప్తూ చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ‘హల్లెలూయా’ అంటున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ హల్లెలూయా అని ప్రభువును స్తుతించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి కాకముందు క్రైస్తవ సమావేశానికి హాజరైనప్పటిది. జూలై 2021లో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ, చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ చమ్‌కౌర్ సాహిబ్‌లోని చర్చిని సందర్శించినప్పటిది ఈ వీడియో. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ 20 సెప్టెంబర్ 2021న ప్రమాణస్వీకారం చేసారు. ఐతే పోస్టులోని వీడియో మాత్రం చరణ్‌జిత్‌ సింగ్ ముఖ్యమంత్రి కాకముందు జరిగిన కార్యక్రమానికి సంబంధించింది. యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇవే విజువల్స్ ఉన్న వీడియోలు జూలై 2021లో అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోల వివరణ ప్రకారం ఈ వీడియో జూలై 2021లో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ చమ్‌కౌర్ సాహిబ్‌లోని చర్చిని సందర్శించినప్పుటి సందర్భంలో తీసినవి.

మరొక యూట్యూబ్ వీడియోలో ఇవే విజువల్స్, సిద్ధూ చమ్‌కౌర్ సాహిబ్‌లోని చర్చిని సందర్శించినప్పుటివంటూ జూలై 2021లో అప్లోడ్ చేసింది. సిద్ధూ, పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ హాజరైన క్రైస్తవ సమావేశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి, ఈ వీడియో చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి కాకముందు హాజరైన క్రైస్తవ సమావేశానికి సంబంధించిందని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఐతే ముఖ్యమంత్రి అయిన తరవాత చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ఈ రోజు అమృత్సర్ లోని దుర్గాయానా, రామ్ తిరథ్ హిందూ దేవాలయాలను దర్శించుకున్నాడు.

చివరగా, ఈ వీడియో చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి కాకముందు క్రైస్తవ సమావేశానికి హాజరైనప్పటిది.

Share.

About Author

Comments are closed.

scroll