Fake News, Telugu
 

అత్తమామల్ని, ఆడపడుచులను ఇంట్లో నుంచి వెళ్లగొడుతామని విద్యార్ధినిలు ప్రతిజ్ఞ చేస్తున్న ఈ వీడియో నిజం కాదు

0

గర్ల్స్ యూత్ ప్లెడ్జ్: భారతదేశం మా అత్తగారిల్లు, భారతీయులందరూ మా బావ బామ్మర్దులు……మా అత్తమామల్ని, ఆడపడుచులను ఇంట్లో నుంచి వెళ్లగొడుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను”, అంటూ కొందరు విద్యార్ధినిలు ప్రతిజ్ఞ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అత్తమామల్ని మరియు ఆడపడుచులను ఇంట్లో నుంచి వెళ్లగొడుతామని అంటూ కొందరు విద్యార్ధినిలు ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోనిది ఒక ఎడిటెడ్ వీడియో. అసలు వీడియోలో విద్యార్ధినిలు తెలుగు మాట్లాడట్లేదు. అసలు ఆ వీడియో తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు. ప్రేమించను మరియు ప్రేమ వివాహం చేసుకోను అంటూ విద్యార్ధినిలతో 14 ఫిబ్రవరి (ప్రేమికుల రోజున) తేదీన మహారాష్ట్రలోని ఒక కాలేజీలో ప్రతిజ్ఞ చేయించినప్పుడు తీసిన వీడియో అది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అదే వీడియోని ఒకరు ఫిబ్రవరి 2020లో ట్వీట్ చేసినట్టు సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చింది. అయితే, ఆ వీడియోలోని ఆడియో వేరే ఉన్నట్టుగా గమనించవచ్చు.

ప్రేమించను మరియు ప్రేమ వివాహం చేసుకోను అంటూ విద్యార్ధినిలతో 14 ఫిబ్రవరి (ప్రేమికుల రోజున) తేదీన మహారాష్ట్రలోని ఒక కాలేజీలో ప్రతిజ్ఞ చేయించినట్టు వివిధ వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి. ఆ వార్తలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. కాబట్టి, పోస్ట్‌లోనిది ఒక ఎడిటెడ్ వీడియో; ఒరిజినల్ వీడియోలో విద్యార్ధినిలు తెలుగు మాట్లాడట్లేదు.

చివరగా, ఒక ఎడిటెడ్ వీడియోని పెట్టి, అత్తమామల్ని మరియు ఆడపడుచులను ఇంట్లో నుంచి వెళ్లగొడుతామని విద్యార్ధినిలు ప్రతిజ్ఞ చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll