Fake News, Telugu
 

వైసీపీ నేత రోజా తన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌ను తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో విమర్శించారని ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.

0

“అధికారం పోయేసరికి ప్లేట్ తిప్పేసిన రోజా..” అని చెప్తూ తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో నగరి మాజీ MLA, వైసీపీ నేత RK రోజా తన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్పు చేశారని క్లెయిమ్ చేస్తున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తను జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం మనం చూడవచ్చు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. 

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: తిరుమల తిరుపతి దేవాలయం లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని చెప్పి మాజీ MLA రోజా విమర్శిస్తున్న వీడియో. 

ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. తిరుమ లడ్డూ వివాదం గురించి మాట్లాడుతూ ఈ వీడియో యొక్క అసలు వెర్షన్‌ని RK రోజా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అసలు వీడియోలో తను టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ, ఆయన తప్పు చేశాడు అని అన్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, వీడియో యొక్క అసలు వెర్షన్ మాకు RK రోజా ఫేస్‌బుక్ అకౌంట్లో దొరికింది. ‘చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు…’ అని రాస్తూ ఈ వీడియోని తను 22 సెప్టెంబర్ 2024న అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో తను టీడీపీ నేత చంద్రబాబు నాయుడుని విమర్శించారు కానీ, తన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించలేదు. ఇదే వీడియోని వైసీపీ పార్టీ వారు కూడా తమ ఫేస్‌బుక్ పేజిలో అప్లోడ్ చేశారు.

ఈ 6:20 సెకన్ల నిడివి గల వీడియోని, రోజా జగన్‌ తప్పు చేశాడు అని అన్నారని అర్థం వచ్చేలా ఎడిట్ చేసి వైరల్ అవుతున్న క్లిప్ తయారు చేశారు. అసలు వీడియోలో ఉన్న క్లిప్స్ ఎక్కడెక్కడి నుంచో కట్ చేసి, ఈ వీడియోని తయారు చేసారో ఇప్పుడు చూద్దాం.

వైరల్ వీడియోలో ముందుగా తను ‘జగనన్న తప్పు చేసాడు’ అని అంటారు. కానీ ఒరిజినల్ వీడియోలో తను 5:06 సెకన్ల దగ్గర, చంద్రబాబు నాయుడు తప్పు చేశావు అని అన్నారు.

తర్వాత తను జగన్ క్షుద్ర పూజలు చేయించారు, విజయవాడలో పవిత్ర దేవాలయాలని కూల్చేశారు అని అంటారు. ఈ మాట తను అసలు వీడియోలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ 5:30 సెకన్ల దగ్గర అంటారు. ‘ఆయన్ని అయితే దేవుడు క్షమించడు, అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడుని క్షమించరు’ అన్న వాక్యాన్ని 5:50 సెకన్ల దగ్గర అంటారు. ‘తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదు…’ అనే వాక్యాన్ని 6:15 మార్క్ దగ్గర అన్నారు.  ఈ విషయంపై మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

చివరిగా, తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ రోజా వ్యాఖ్యలు చూపించిన వీడియోని ఎడిట్ చేసి తను జగన్ తప్పు చేశాడని అన్నారని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll