Fake News, Telugu
 

బీఎస్పీ నేత మాయావతి బీజేపీకి మద్దతు తెలిపినట్టు షేర్ చేస్తున్న ఈ వీడియో 2020 ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినది

0

సమాజ్‌వాది పార్టీని ఓడించడానికి అవసరమైతే బీజేపీ అభ్యర్దులకు కూడా మద్దతిస్తాం అని ప్రకటించిన బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి’, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్టంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీని ఓడించడానికి అవసరమైతే బీజేపీ అభ్యర్దులకు కూడా మద్దతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది. 

ఫాక్ట్ (నిజం): బీఎస్పీ నేత మాయావతి ఈ వ్యాఖ్యలు 2020 అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో చేసారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఓడించడానికి అవసరమయితే బీజేపీకి కూడా ఓటు వేస్తామని మాయావతి అప్పుడు ప్రకటించారు. కాని, ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే, మాయావతి, తాను అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటాను కాని బీజేపీకి మాత్రం మద్దతు పలకనని మీడియాకు స్పష్టం చేసారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మాయావతి ఇటీవల బీజేపీ ‘దళిత వ్యతిరేక’ విధానాలు అమలుపరుస్తుందని నిందించారు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ANI’ న్యూస్ సంస్థ 29 అక్టోబర్ 2020 నాడు ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఓడించడానికి ప్రత్యర్ధి పార్టీలకు అవసరమయితే బీజేపీకి కూడా ఓటు వేస్తామని మాయావతి ప్రకటించినట్టు ఈ ట్వీట్లో తెలిపారు.

ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2020 అక్టోబర్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కాని, ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే మాయావతి తాను అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటాను కాని బీజేపీకి మాత్రం మద్దతు పలకనని ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ నేత మాయావతి బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 04 ఫిబ్రవరి 2022 నాడు మాయావతి, బీజేపీ ‘దళిత వ్యతిరేక’ విధానాలు అమలుపరుస్తుందని నిందించారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో 2020 ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన వీడియో అని, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన పాత వీడియోని ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీఎస్పీ నేత మాయావతి బీజేపీకి మద్దతు ప్రకటించినట్లుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll