Fake News, Telugu
 

ఈ వీడియోలో వర్షం నీళ్ళతో నిండి ఉన్నది హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం కాదు

0

తాజాగా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా శంషాబాద్ విమానశ్రయంలోకి నీళ్ళు వచ్చి సముద్రాన్ని తలపిస్తుందని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వర్షం నీళ్ళతో సముద్రాన్ని తలపిస్తున్న హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం వీడియో.

ఫాక్ట్: పోస్ట్ చేసినది మెక్సికో లో 2017లో తీసిన పాత వీడియో. వీడియోలో వర్షం నీళ్ళతో ఉన్నది మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానశ్రయం; హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. అదే వీడియో కనీసం ఆగస్టు 2017 నుండి ఇంటర్నట్ లో షేర్ అవుతున్నట్టు చూడవొచ్చు. ఆ వీడియో మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానశ్రయం (Aeropuerto Internacional Benito Juárez) కి సంబంధించినదని చాలా మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఆ పోస్ట్ లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. వీడియోలోని ఒక ఫ్రేమ్ లో మెక్సికో జెండా రంగులు కూడా చూడవొచ్చు  

అంతేకాదు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వారు కూడా పోస్ట్ లోని వీడియో హైదరాబాద్ విమానాశ్రయం కి సంబంధించింది కాదని తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసారు.

ఇంతకముందు కూడా ఇదే వీడియోని ప్రపంచంలోని వివిధ నగరాలలోని (సింగపూర్, ముంబై, బెంగళూరు, మియామీ) విమానాశ్రయాలకి సంబంధించిన వీడియోగా షేర్ చేసినప్పుడు, అది మెక్సికో కి సంబంధించిన వీడియో అని వివిధ మీడియా సంస్థలు ప్రచురించిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, మెక్సికో కి సంబంధించిన పాత వీడియో పెట్టి, వర్షం నీళ్ళతో సముద్రాన్ని తలపిస్తున్న హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll