Fake News, Telugu
 

ఈ వీడియోలోని లైట్ షో ని చైనా లో నిర్వహించారు; జోధ్‌పూర్ (రాజస్తాన్) లో కాదు.

0

రాజస్తాన్ లోని జోధ్‌పూర్ లో నిర్వహించిన లైట్ షో అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాజస్తాన్ లోని జోధ్‌పూర్ లో నిర్వహించిన లైట్ షో కి సంబంధించిన వీడియో.

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియోలో ఉన్న లైట్ షో అసలు భారత్ కి సంబంధించింది కాదు. అది చైనా లోని ‘Shuangqing Bay Park’ లో నిర్వహించే షో కి సంబంధించింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, గత సంవత్సరం ఇదే వీడియో వేరే క్లెయిమ్ తో వైరల్ అయినప్పుడు చైనీస్ మీడియా సంస్థలు రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. ఆ ఆర్టికల్స్ లో ‘Hangzhou Internet police’ వారు ఆ వీడియో పై ఇచ్చిన వివరణని చూడవొచ్చు. ఆ వీడియో ‘Shuangqing Bay Park’ లో నిర్వహించిన ‘War of Shunchang’ షో కి సంబంధించిందని వారు తెలిపారు. కావున, ఆ పదాలతో వెతకగా, అలాంటి షో వీడియో ఒకటి యూట్యూబ్ లో దొరుకుతుంది. ఆ వీడియో కింద వివరణ లో – ‘Best Fountain-ShuangQing Bay Water Show Theatrical Show ShunChang Battle’, అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు.

కొన్ని చైనీస్ పదాలతో వెతకగా, అలాంటి మరిన్ని వీడియోలు చైనీస్ ‘టెన్సెంట్ వీడియో’ వెబ్ సైట్ లో వస్తాయి. ఆ వీడియోలను ఇక్కడ [1, 2, 3, 4, 5, 6] చూడవొచ్చు.

అంతేకాదు, ఆ పార్క్ యొక్క ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్స్ లో చైనా లో చూడవొచ్చు. ఆ పార్క్ కి సంబంధించిన మరిన్ని ఫోటోలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు

చివరగా, వీడియోలోని లైట్ షో ని చైనా లో నిర్వహించారు; జోధ్‌పూర్ (రాజస్తాన్) లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll