Fake News, Telugu
 

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన పాత వీడియోని ఇటీవల భారత నేవీ జరుపుకున్న దీపావళి వేడుకల వీడియో అని షేర్ చేస్తున్నారు.

0

సముద్రంలో లైట్స్ తో అలంకరించిన వార్ షిప్స్ మరియు బాణసంచా కాలుస్తున్న వీడియో చూపిస్తూ ఈ వీడియో భారత నేవీ దీపావళి జరుపుకుంటున్న వీడియో అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత నేవీ దీపావళి వేడుకల వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2016లో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించింది. చాలా వార్తా సంస్థలు ఈ ఈవెంట్ కి సంబంధించి ఇలాంటివే ఫోటోలు మరియు వీడియోస్ షేర్ చేసాయి. ఈ వీడియోకి ఇండియన్ నేవీ దీపావళి వేడుకలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇలాంటి విజువల్స్ పోలిన ఒక 2016 యూట్యూబ్ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో కింద ఇచ్చిన వివరణ ప్రకారం ఈ వీడియో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కి సంబంధించినదానిగా తెలుస్తుంది.

యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన తేది మరియు వివరణ ప్రకారం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులోని వీడియోలోని విజువల్స్ ని పోలిన ఫోటోను ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు మాకు దొరికాయి. ఈ కథనాల ప్రకారం ఈ ఫోటోలు 2016లో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కి సంబంధించినవి. ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

ఇంకా గూగుల్ సెర్చ్ ద్వారా పోస్టులో ఉన్న వీడియోలోని విజువల్స్ ని పోలిన ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేసిన కొన్ని వార్తా సంస్థల మరియు భారత నేవీ చేసిన కొన్ని పాత ట్వీట్స్ మాకు కనిపించాయి. ఈ ట్వీట్స్ ప్రకారం ఈ ఫోటోలు మరియు వీడియోలు 2016లో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కి సంబంధించినట్టు ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కి సంబంధించిన పూర్తి వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసారు. ఈ వీడియోలో పోస్టులో ఉన్న విజువల్స్ వీడియోలో చూడొచ్చు. వీటన్నిటిని బట్టి పోస్టులో ఉన్న వీడియో 2016 లో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించిందని, ఈ వీడియోకి భారత నేవీ దీపావళి వేడుకలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఈ వీడియో భారత నేవీ దీపావళి వేడుకలకు సంబంధించినది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll