ఒక వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి ‘కర్నూల్ లో ఒక పేద రైతు పరిస్థితి ఇది .. తను తినే కూడును పండించే అన్నం తన్నిన బ్యాంక్ ఉద్యోగి .. బాబు రుణమాఫీ ఎవరికి చేసింది ??’ అంటూ పోస్టు చేస్తున్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: కర్నూల్ లో ఒక పేద రైతు పరిస్థితి కి సంబంధించిన వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన వీడియో క్లిప్ వాస్తవ సంఘటన కాదు, అది ‘రైతన్న’ అనే ఒక షార్ట్ ఫిల్మ్ లోని క్లిప్. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
ఆ వీడియోని 9 నెలల క్రితం ఫేస్బుక్ లో పెట్టారు, కానీ దానిని ప్రస్తుతం కూడా చాలా మంది షేర్ చేస్తున్నారు.
పోస్టులో పెట్టిన వీడియో యొక్క కామెంట్స్ విభాగంలో ఒక వ్యక్తి ఆ క్లిప్ ‘రైతన్న’ అనే ఒక షార్ట్ ఫిల్మ్ లోనిది అని పేర్కొని, దాని టీజర్ లింక్ ని పెట్టాడు. ఆ సమాచారంతో యూట్యూబ్ లో వెతికినప్పుడు, ఆ షార్ట్ ఫిల్మ్ యొక్క పూర్తి వీడియో లభించింది. అందులో, 10:04 నుండి 10:15 వరకు ఆ వీడియో క్లిప్ కి సంబంధించిన భాగాన్ని చూడవచ్చు.
చివరగా, ఒక షార్ట్ ఫిల్మ్ లోని క్లిప్ పెట్టి ‘కర్నూల్ లో ఒక పేద రైతు పరిస్థితి ఇది’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఒక షార్ట్ ఫిల్మ్ లోని క్లిప్ పెట్టి ‘కర్నూల్ లో ఒక పేద రైతు పరిస్థితి ఇది’ అని తప్పుగా ప్రచారం