వేటాడుతున్న ఒక శివంగి బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక ఎలుగుబంటి వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఈ వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు నామినేట్ అయిన వీడియో అని క్లెయిమ్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు ఈ పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఒక ఆడ సింహం బారి నుండి ఒక ఎలుగుబంటి తపించుకుంటున్న ఈ వీడియో, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 1988లో విడుదలైన ఫ్రెంచ్ సినిమా ‘ది బేర్’లోని ఒక చిన్న క్లిప్. ఈ సినిమా అకాడమీ అవార్డులు మరియు BAFTA అవార్డులలో వివిధ విభాగాల క్రింద నామినేట్ చేయబడింది, 1990 జెనెసిస్ అవార్డ్స్‌లో ఇది ఉత్తమ చలన చిత్రంగా నిలిచింది. అయితే, వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా ఈ సినిమా ఏ విభాగంలోనూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోలేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లను ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే విజువల్స్ ఉన్న వీడియో ఒకటి మాకు యూట్యూబులో లభించింది. 31 అక్టోబర్ 2007న అప్లోడ్ చేసిన ఈ వీడియో టైటిల్ ప్రకారం, ఇది 1988లో విడుదలైన L’Ours అనే సినిమా యొక్క చిన్న క్లిప్‌గా.
‘ది బేర్’ ( L’Ours) అనే ఫ్రెంచ్ సినిమాను జీన్-జాక్వెస్ అన్నాడ్ దర్శకత్వం వహించారు. “ది గ్రిజ్లీ కింగ్” అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ‘ది బేర్’ చిత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరిందా లేదా అని గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌లో వెతికితే, ‘ది బేర్’ చిత్రం ఏ విభాగంలోనూ లిస్ట్ అయినట్లు మాకు కనిపించలేదు.
అకాడమీ అవార్డు, బాఫ్టా మరియు ఇతర అవార్డులలో వివిధ విభాగాల క్రింద ‘ది బేర్’ నామినేట్ చేయబడింది. ఈ సినిమా 1990 జెనెసిస్ అవార్డ్స్‌లో ఉత్తమ చలన చిత్రంగా కూడా గెలుపొందింది. కానీ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా ఈ చిత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించలేదు.
చివరిగా, ‘ది బేర్’ చిత్రంలోని ఈ వీడియో క్లిప్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎంపిక కాలేదు.