Fake News, Telugu
 

చెన్నై సముద్రపు ఒడ్డున భగవద్గీత చదువుతున్న విక్రం సారాభాయ్‌ని మొదటిసారి కలిసిన అబ్దుల్ కలాం అంటూ షేర్ అవుతున్న ఈ కథ నిజమైంది కాదు.

0

చెన్నై సముద్రపు ఒడ్డున భగవద్గీత చదువుతున్న విక్రం సారాభాయ్‌ని మొదటిసారి కలిసిన అబ్దుల్ కలాం యొక్క కథ అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ కథ మొత్తం కలాం గారు తన ఆత్మకథలో రాసారని కూడా పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చెన్నై సముద్రపు ఒడ్డున భగవద్గీత చదువుతున్న విక్రం సారాభాయ్‌ని మొదటిసారి కలిసిన అబ్దుల్ కలాం యొక్క కథ.

ఫాక్ట్: అబ్దుల్ కలాం విక్రం సారాభాయ్‌ని మొదటిసారి చెన్నై సముద్రపు ఒడ్డున కలిసారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ వారు రాకెట్ ఇంజినీర్ పోస్ట్ కొరకు అబ్దుల్ కలాంని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు, మొదటిసారిగా విక్రం సారాభాయ్‌ని కలాం ఆ ఇంటర్వ్యూలోనే కలిసారు. ఇదే విషయాన్ని అబ్దుల్ కలాం తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లో కూడా తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఈ కథ విక్రం సారాభాయ్, ఇంకా ఒక యువకుడి మధ్య జరిగిన నిజమైన సంఘటనగా కనీసం 2017 నుండి ఇంటర్నెట్‌లో (ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ అవుతుంది. అందులో ఆ యువకుడు అబ్దుల్ కలాం అని ఎక్కడా లేదు.  

పోస్టులో ఒక ఫోటోను షేర్ చేసారు, ఆ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఒక బ్లాగ్ ఆర్టికల్ ఒకటి లభించింది. అబ్దుల్ కలాం విక్రం సారాభాయ్ గురించి ఏమి వ్యాఖ్యలు చేసారో ఆ ఆర్టికల్‌లో రాసారు. ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ వారు రాకెట్ ఇంజినీర్ పోస్టు కొరకు అబ్దుల్ కలాంని ఇంటర్వ్యూకి పిలిచారు, మొదటిసారిగా విక్రం సారాభాయ్‌ని కలాం ఆ ఇంటర్వ్యూలోనే కలిసారు. ఇదే విషయాన్ని అబ్దుల్ కలాం తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లో కూడా తెలిపారు. ఆర్టికల్‌లో ఎక్కడా కూడా చెన్నై సముద్రపు ఒడ్డున జరిగిన సంఘటన గురించి లేదు.

వివిధ మత గ్రంథాలు తనను బాగా ప్రభావితం చేశాయని; ఖురాన్, వేదాలు, భగవద్గీత, ఇవన్నీ మనిషి యొక్క దుస్థితిపై లోతైన తాత్విక ఆలోచనలు కలిగి ఉన్నాయని, మరియు తన జీవితంలో వివిధ సమయాల్లో అనేక సమస్యలను పరిష్కరించడానికి తనకు సహాయపడ్డాయని కలాం ‘మై జర్నీ: ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ ఆక్షన్స్‘ పుస్తకంలో తెలిపారు. ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కూడా లక్ష్మణ శాస్త్రి (రామేశ్వరం గుడి పూజారి) భగవద్గీత నుండి చెప్పిన కొన్ని వ్యాఖ్యలు తనను ప్రభవితం చేసాయని తెలిపారు.

విక్రం సారాభాయ్ వృత్తిరిత్యా తనను ఎంతగా ప్రభావితం చేసేవారో అబ్దుల్ కలాం తరచూ చెప్తుండేవారు. కానీ, చెన్నై సముద్రపు ఒడ్డున జరిగిన కథ గురించి ప్రస్తావించినట్టు మాకు ఎక్కడా సమాచారం లభించలేదు.

చివరగా, చెన్నై సముద్రపు ఒడ్డున భగవద్గీత చదువుతున్న విక్రం సారాభాయ్‌ని మొదటిసారి కలిసిన అబ్దుల్ కలాం అంటూ షేర్ అవుతున్న ఈ కథ నిజమైందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll