“కురుక్షేత్రంలో‘అమర మర్రిచెట్టు’కింద అర్జునుడికి భగవద్గీత జ్ఞానాన్ని అందించిన చోట ఒక మజార్ని నిర్మించడం ప్రారంభించారు” అంటూ హిందూ దేవాలయ ప్రాంగణంలో సమాధి వంటి నిర్మాణాన్ని చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: కురుక్షేత్రంలో ‘అమర మర్రి చెట్టు’ కింద అర్జునుడికి భగవద్గీత జ్ఞానాన్ని అందించిన చోట ఒక మజార్ నిర్మించబడింది.
ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న విజువల్స్ కురుక్షేత్రలోని ‘గీతా ఉపదేశ్ స్థల్’ ప్రాంగణంలో ఏ ఇస్లామిక్ సమాధిని చూపించడం లేదు. ఇది ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబం వారి పూర్వీకుల జ్ఞాపకార్థం నిర్మించిన భోర్ఖా. ఇదే విషయాన్ని 2022లో వార్తా కథనాలు ధృవీకరించాయి. ఇంకా, వార్తా కథనాల ప్రకారం, కొంతమంది ఈ నిర్మాణంపై చాదర్ (దానిపై 786′ & ‘జై పీర్ బాబే ది’ అని వ్రాయబడింది) ఉంచారు, దాని తర్వాత మతపరమైన వాదనతో వాట్సాప్‌లో వీడియోను వైరల్ చేశారు. ఈ నిర్మాణం నిజంగా హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందినదని పరిపాలనా, పోలీసు అధికారులు కూడా ధృవీకరించారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోకు సంబంధించిన కీవర్డ్ సెర్చ్‌ను నిర్వహించగా, అధికారిక వెబ్‌సైట్ ప్రకారం గీత జన్మస్థలమైన జ్యోతిసార్‌ను పోలి ఉండే విజువల్స్ ఇందులో ఉన్నాయని మేము కనుగొన్నాము. ఇది కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించిన ప్రదేశం అని వెబ్సైట్ పేర్కొంది.
అయితే, ఈ వీడియోలో చూపించిన సమాదిని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఇది ఇస్లామిక్ సమాధి కాదు అని, చాలా సంవత్సరాల క్రితం హిందూ కుటుంబం వారి పూర్వీకుల జ్ఞాపకార్థం నిర్మించిన నిర్మాణం అని 10 మే 2022న దైనిక్ జాగరణ్ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన వార్త ద్వారా తెలుసుకున్నాం. ఈ కథనం ప్రకారం, ఎవరో, ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించిన పండిట్ అత్పాల్ పూర్వీకులకు చెందిన భోర్ఖాపైచద్దర్ (786′ & ‘జై పీర్ బాబే ది’ అని వ్రాసారు) ఉంచారు. ఈ రెండు దృశ్యాల పోలికను క్రింద చూడవచ్చు.
దైనిక్ భాస్కర్ 2022లో వెప్రచురించిన కథనం ప్రకారం,“జ్యోతిసర్ తీర్థంలోని గీతా ఉపదేశ్ స్థల్‌లో మజార్ తరహా భోర్ఖాలను నిర్మించడం అనే అంశం పై హిందూ సంస్థలు జోక్యం చేసుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. భోర్ఖాలను నిర్మించిన కుటుంబం తమ పూర్వీకులు ఈ స్థలాన్ని నిర్మించారని మరియు వారు అక్కడ తరచూ దీపాలను వెలిగిస్తారని పేర్కొన్నారు. ఇక్కడ ఎవరో నీలిరంగు గుడ్డ వేసి ఫలానా వర్గానికి చెందిన పీర్‌గా మార్చేందుకు ప్రయత్నించారని, ఇందుకు సంబంధించిన వీడియోను కావాలనే వైరల్ చేశారని ఆరోపించారు. తరువాత, కుటుంబ సభ్యులు బూర్ఖాను వేరే చోటికి మార్చారు” అని ప్రచురించింది.
అంతే కాకుండా, ఆజ్ తక్ తన కథనంలో ఈ వైరల్ క్లిప్ ఏ ఇస్లామిక్ సమాధిని చూపించడం లేదు, ఇది ఒక హిందూ భోర్ఖా అని నివేదించింది. అతని పూర్వీకులు నిర్మించిన ఈ కట్టడం గురుంచి వినోద్ శర్మతో మాట్లాడిన తర్వాత ఆజ్ తక్ వారుఈ విషయాన్ని ధృవీకరించారు. అడ్మినిస్ట్రేటివ్ మరియు పోలీసు అధికారులు కూడా ఈ దావా నిజం కాదు అని తెలిపారు అని ఆజ్ తక్ ప్రచురించింది.
చివరిగా, కురుక్షేత్ర జ్యోతిసర్‌లోని ‘గీతా ఉపదేశ్ స్థల్’ ప్రాంగణంలో ఇస్లామిక్ సమాధి నిర్మించబడిందని ఈ వీడియో తప్పుగా పేర్కొంది