Fake News, Telugu
 

తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ షేర్ చేస్తున్న ఈ పోస్టులో నిజం లేదు

0

తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలు.

ఫాక్ట్: తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ షేర్ చేస్తున్న ఈ పోస్టులో నిజంలేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి 2015లో కూడా ఇటువంటి క్లెయిమ్ వైరల్ అయినప్పుడు, టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇవి తప్పని తెలిపారు. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మానవదేహ లక్షణాలు ఉండవు. దేవుడికి సమర్పించే పూలు ప్రత్యేకంగా ఒక ఊరినుండి రావడం ఇప్పటివరకు జరగలేదు; మరియు పూలను వెంకటేశ్వర స్వామి వెనకవేయడం అనేది జరగదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.   

తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ సోషల్ మీడియాలో ఎప్పటినుంచో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి 2015లో కూడా ఇటువంటి క్లెయిమ్ వైరల్ అయినప్పుడు, టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలయానికి సంబంధించి అసత్యమైన ప్రచారాలు సోషల్ మీడియాలో వస్తున్నాయని అన్నారు. అందులో కొన్ని క్లెయిమ్స్ ఆయన తప్పని తెలిపారు. 

తిరుమల వేంకటేశ్వరునికి తల భాగంలో వెంట్రుకలు ఉన్నాయి మరియు ఆయన విగ్రహానికి చమటపడుతుంది :

స్వామివారికి వెనక వెంట్రుకలు లేవు. వెంట్రుకలు, స్వామివారి దేహం మెత్తగా ఉండటం, లేక, స్వామివారికి స్వేదం – అంటే చమటపట్టడం – స్వామివారికి గోళ్ళు పెరగడం; ఇటువంటివి అన్నీ కూడా ప్రాకృతమైన మానవదేహ లక్షణాలు కాబట్టి అప్రాకృతమైన స్వామివారికి ఇవ్వన్నీ ఆపాదించడం ఒక అజ్ఞానం.” అని రమణ దీక్షితులు అన్నారు.

తిరుమల దేవాలయంలో ఉపయోగించే పూలు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు తదితర వస్తువులను తిరుపతికి 22 కి.మీ దూరంలో ఉండే ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు :

ఈ పుష్పాల్నన్నిటిని కూడా స్వామివారి దేవాలయం చుట్టూ ఉన్న తిరుమలలో పెంచబడే ఉద్యానవనాల్లోనించి లేక భక్తులు సమర్పించబడే పుష్పాల్లోనించి మాలలు కట్టి స్వామివారికి … ఇది ప్రత్యేకంగా ఒక ఊరినుండి రావడం, ఒక భక్తుడు సమర్పించడం అనేది ఇప్పటివరకు జరగలేదు.” అని రమణ దీక్షితులు అన్నారు.

వేంకటేశ్వరునికి నిత్యం పూజించే పూలు స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వేస్తారు. ఆ పూలు తిరుపతికి 20 కిమీ దూరంలో ఉండే వేర్పేడులో కనిపిస్తాయి :

పూలను అద్దాలమండపం పక్కన ఉన్న ఒక పూలబావిలో వేసేవారని, ఇప్పుడు ఆ పూలబావి నిండిపోవడం వల్ల స్వామివారి ఉద్యానవనంలో, అలంకారం కోసం పెంచే పుష్పవనంలో వాటిని వాడతారు. “స్వామివారి వెనకవేయడం అనేది జరగదు”.

పోస్టులో చెప్పిన విషయాల గురించి ఇటీవల ప్రచురించిన సమాచారమేది మాకు లభించలేదు.

చివరగా, తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll