Fake News, Telugu
 

తిరుమల ఆలయానికి కాలినడక మార్గాన 15ఏళ్ళ పిల్లలతో వెళ్లే భక్తులకి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పరిమితి ఉంది అని టీటీడీ ప్రకటించింది

0

ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఒక ఆరేళ్ళ చిన్నారి చిరుతపులి దాడిలో మరణించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) ఏ.వి. ధర్మా రెడ్డి తిరుమల కాలినడక మార్గాన్ని మూసేద్దాం అనుకుంటున్నాం అని అన్నారు అని చెప్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: తిరుమల కాలినడక మార్గాన్ని మూసేద్దాం అనుకుంటున్నాం అని చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.వి. ధర్మా రెడ్డి 

ఫాక్ట్(నిజం): ఒక ఆరేళ్ళ చిన్నారి ఇటీవల తిరుమల బాలాజీ దర్శనానికి వెళ్తూ చిరుతపులి దాడిలో మరణించిన తర్వాత టీటీడీ ఈఓ ఏ.వి.ధర్మా రెడ్డి, కాలినడక బాటలో శ్రీ వారి దర్శనానికి వెళ్లే మార్గంలో బందోబస్తు మరింత పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై మాట్లాడుతూ, 6 గంటలకి ముందే తిరుమల దేవాలయానికి ఉన్న నడక దారుల్ని మూసివేయాలి అని తనకి కొందరు ఇచ్చిన సలహాల గురించి చెప్పారు. ఇలా చేస్తే భక్తులు ఏమైనా ఇబ్బంది పడతారా అని ఆలోచించి ఈ సలహాల గురించి వాళ్ళు పరిశీలిస్తున్నట్లు మీడియాకి తెలిపారు. తర్వాత 13 ఆగష్టు 2023న వచ్చిన వార్త కథనాల ప్రకారం, 15ఏళ్ళ పిల్లలతో కాలినడకన తిరుమల దేవాలయ దర్శనానికి వెళ్లే భక్తులని, ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది. 

ఈ విషయం వెనుక ఉన్న నిజానిజాల్ని తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో సరైన కి వర్డ్స్ ఉపయోగించి వెతుకగా అనేక వార్తా కథనాలు మాకు లభించాయి. 12 ఆగష్టు 2023 నాడు వచ్చిన వార్త కథనాల(ఇక్కడ, ఇక్కడ) ప్రకారం, టీటీడీ ఈఓ ఏ.వి.ధర్మా రెడ్డి తిరుమలకి వెళ్లే కాలినడక మార్గాన భద్రతని పెంచుతున్నట్లు చెప్పారు, 500 సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అని పేర్కొన్నారు. అంతే కాక ‘రెండు కాలినడక మార్గాలను సాయంత్రం 6 గంటలకు మూసివేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు(ఈ వీడియో చుడండి).’ ధర్మా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యని వైరల్ పోస్టులో తిరుమల కాలినడక మార్గాన్ని పూర్తిగా మూసేసే యోచనలో ఉన్నట్లు తాను అన్నారు అనే అర్థ వచ్చే లాగా షేర్ చేస్తున్నారు.

13వ తారీఖున వచ్చిన వార్త కథనాలు 15ఏళ్ళ పిల్లలతో వెళ్లే భక్తులని ఉదాయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పరిమితి ఉంది అని టీటీడీ ప్రకటించింది అని పేర్కొన్నాయి. ఈ కథనాల్ని మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. టీటీడీ అధికారిక వెబ్సైటులో దీని గురుంచి అధికారిక ప్రకటన ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, తిరుమల నడక దారిలోపు విధించాలనుకొంటున్న ఆంక్షల గురించి టీటీడీ ఈఓ ఏ.వి.ధర్మా రెడ్డి  చేసిన వ్యాఖ్యలను అసంపూర్ణంగా చెప్తూ, తప్పుదోవ పట్టించేలాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు 

Share.

About Author

Comments are closed.

scroll