‘లండన్‌లో ఇది పరిస్థితి’, అని చెప్తూ, కొందరు వ్యక్తులు రోడ్డుపై నమాజ్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కొందరు వ్యక్తులు రోడ్డుపై నమాజ్ చేస్తున్న ఈ వీడియో లండన్‌కి సంబంధించినది.
ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో లండన్‌కి సంబంధించింది కాదు. వీడియోని కెనడాలోని మిస్సిసాగా నగరంలో తీసారు. కెనడాలోని మిస్సిసాగా నగరంలో 2021 మే నెలలో పాలస్తీనాకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఫోటోల్లో వీడియోలోని బిల్డింగ్ కనపడుతుంది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోని అమెరికాలో (‘47th Street, Diamond Market, NYC, USA’) తీసారని చెప్తూ కొందరు పోస్ట్ చేసినట్టు తెలిసింది. అయితే, వారు చెప్పిన ప్రదేశానికీ, పోస్ట్‌లోని వీడియోకి ఎక్కడా ఎటువంటి పోలికలు కనపడలేదు. వీడియోని సరిగ్గా గమనిస్తే, ‘పాలస్తీనా’ మరియు ‘కెనడా’ జెండాలు లాగా అక్కడక్కడా కొన్ని జెండాలు ఉన్నట్టు చూడవొచ్చు.
కొన్ని కీ-వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కెనడాలోని మిస్సిసాగా నగరంలో 2021 మే నెలలో పాలస్తీనాకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఫోటోల్లో వీడియోలోని బిల్డింగ్ కనపడుతుంది. ఆ ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. ఆ ప్రాంతం పేరు ‘సెలబ్రేషన్ స్క్వేర్’ అని తెలిసింది.
కెనడాలోని మిస్సిసాగా నగరంలో ఉన్న ‘సెలబ్రేషన్ స్క్వేర్’ యొక్క గూగుల్ స్ట్రీట్ వ్యూలో కూడా వీడియోలోని పరిసరాలను చూడవొచ్చు.
అయితే, లండన్ వీధుల్లో కొందరు నమాజ్ చేస్తున్న వేరే ఫోటోలను మాత్రం ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, కొందరు రోడ్డుపై నమాజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్న ఈ వీడియో లండన్‌కి సంబంధించింది కాదు. ఆ వీడియోని కెనడాలో తీసారు.