Fake News, Telugu
 

జాంబియా దేశంలోని విక్టోరియా జలపాతంలో ప్రధాని మోదీ చిత్రం ఆవిష్కృతమైంది అని ఒక ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తున్నారు

0

ఒక పెద్ద జలపాతంలో ప్రధాని మోదీ చిత్రం అవిష్కృతమైంది అని, ఇది జాంబియా దేశంలో ఉన్న విక్టోరియా జలపాతం అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: జాంబియా దేశంలోని విక్టోరియా జలపాతంలో నరేంద్ర మోదీ చిత్రం ఆవిష్కృతమైంది. 

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో ఎడిట్ చేయబడింది, ఇందులో కనిపిస్తున్న జలపాతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పుర్వ జలపాతానివి. ఈ ఫోటో ఈ జలపాతం ఉన్న రేవా జిల్లా యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్సైటులో ఉంది. కావున ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి, వైరల్ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా ఈ ఫోటో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఉన్న పుర్వ జలపాతానిది అని తెలిసింది. 

ఈ ఫోటోని జలపాతం రేవా జిల్లా అధికారిక వెబ్సైటులో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వారు అప్లోడ్ చేసారు. దీన్ని ఇక్కడ చూడవచ్చు. ఇందులో నరేంద్ర మోదీ ఫోటో ఆవిష్కృతమై లేదు. దీన్ని బట్టి, వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 

అదనంగా, ఈ ఫోటో ABN ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో ఉంది అని మనం గమనించవచ్చు. ఇంటర్నెట్లో ఈ కథనం కోసం తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతకగా 2016లో ABN ఆంధ్రజ్యోతి వారు అప్లోడ్ చేసిన ఒక Facebook పోస్టు లభించింది, ఈ పోస్టు యొక్క వివరణలో ‘ జాంబియా జలపాతంలో మన ప్రధాని మోదీ ప్రత్యక్షం!’ అని రాసి ఉంది. ఈ పోస్టులో ఉన్న లింకుని క్లిక్ చేస్తే, ఇది ఆంధ్రజ్యోతి వెబ్సైటుకి దారి తీసింది. కానీ ఆ పేజీలో ఎటువంటి ఆర్టికల్ లేదు. ముందు ఈ కథనాన్ని ప్రచురించి, తర్వాత డిలీట్ చేసి ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. 

చివరిగా,  జాంబియా దేశంలోని విక్టోరియా జలపాతంలో ప్రధాని మోదీ చిత్రం ఆవిష్కృతమైంది అని ఒక ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తున్నారు 

Share.

About Author

Comments are closed.

scroll