Fake News, Telugu
 

ICSకు రాజీనామా చేస్తూ సుభాష్ చంద్ర బోస్ రాసినదంటూ షేర్ చేస్తున్న ఈ లేఖలో ఉన్నది బోస్ చేతిరాత కాదు

0

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ చేతిరాతను పొగిడే క్రమంలో, బోస్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేస్తూ తన స్వహస్తాలతో రాసిన లేఖ అంటూ ఒక ఫోటోని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ లేఖలోని చేతిరాతను బోస్‌కు ఆపాదిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సుభాష్ చంద్ర బోస్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేస్తూ తన స్వహస్తాలతో రాసిన లేఖ.

ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న లేఖలోని విషయం నిజమే అయినప్పటికీ, అది బోస్ స్వహస్తాలతో రాసింది కాదు. అది టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. బోస్ రాసిన అసలు లేఖ నేషనల్ ఆర్కైవ్స్ లో అందుబాటులో ఉంది. ఈ లేఖలో బోస్ చేతిరాత భిన్నంగా ఉండడం చూడొచ్చు. అలాగే బోస్ చేతిరాతను ద్రువీకరించే విధంగా బోస్ రాసిన అనేక లేఖల్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వీటిలో కూడా బోస్ చేతిరాత వైరల్ అవుతున్న లేఖలోని రాతతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఏప్రిల్ 1921లో ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS)కు రాజీనామా చేశారు. ICS ప్రొబేషనర్ల జాబితా నుండి తన పేరును తొలగించాలని కోరుతూ బోస్, అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అయిన ఈ. ఎస్. మోంటాగుకు తన స్వహస్తాలతో లేఖ రాసారు. ఐతే వైరల్ పోస్టులో షేర్ చేసింది బోస్ తన స్వహస్తాలతో రాసిన లేఖ కాదు. అది టెక్నాలజీ ఉపయోగించి రూపొందించిన లేఖ. కాకపోతే ఈ లేఖలో ఉన్న సమాచారం మరియు బోస్ తన స్వహస్తాలతో రాసిన లేఖలోని సమాచారం ఒకటే.

నేతాజీ స్వహస్తాలతో రాసిన లేఖ :

ఇండియన్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేస్తూ నేతాజీ తన స్వహస్తాలతో రాసిన లేఖ నేషనల్ ఆర్కైవ్స్ లో అందుబాటులో ఉంది. భారత మాజీ దౌత్యవేత్త నిరుపమ మీనన్ రావు నేషనల్ ఆర్కైవ్స్ నుండి సేకరించిన బోస్ లేఖ యొక్క నకలు ఇక్కడ చూడొచ్చు. ఈ లేఖలో బోస్ చేతిరాత భిన్నంగా ఉండడం చూడొచ్చు.

అంతకు ముందు మొదటిసారిగా కృష్ణ బోస్ రాసిన ‘ఇతిహాసర్ సంధానే’ అనే పుస్తకంలో ICSకు రాజీనామా బోస్ రాసిన ఈ లేఖను ప్రచురించాడు.

బోస్ చేతిరాత ద్రువీకరించే ఇతర లేఖలు :

బోస్ పలు సందర్భాలలో తన స్వహస్తాలతో రాసిన లేఖలు కొన్ని నేషనల్ ఆర్కైవ్స్ మరియు ఇండియా కల్చర్ వెబ్సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ లేఖలలో బోస్ చేతిరాత వైరల్ లేఖలో కన్నా చాలా భిన్నంగా ఉండడం గమనించవచ్చు.

గతంలో కూడా ఇలాగే ఒక లేఖ వైరల్ అయ్యింది :

గతంలో కూడా విక్టోరియా మెమోరియల్ హాల్ బోస్ ICSకు రాజీనామా చేస్తూ రాసిన లేఖ అంటూ ఒక లేఖను ప్రదర్శించింది. అప్పుడు బోస్ వారసులు ఈ లేఖ బోస్ స్వహస్తాలతో రాసింది కాదంటూ వ్యతిరేకించారు (ఇక్కడ మరియు ఇక్కడ). బోస్ రాసిన లేఖ లండన్‌లోని ఇండియా ఆఫీస్ ఆఫ్ రికార్డ్స్‌లో అందుబాటులో ఉందని, అక్కడి నుండి తాము సేకరించి నేతాజీ భవన్‌లో ప్రదర్శించినట్టు కూడా వారు తెలిపారు. వీటన్నిటి బట్టి వైరల్ అవుతున్న లేఖలోని విషయం నిజమే అయినప్పటికీ అది బోస్ స్వహస్తాలతో రాసింది కాదని స్పష్టమవుతుంది.

చివరగా, ఈ లేఖలో చెప్తున్న విషయం నిజమే అయినప్పటికి, లేఖలో ఉన్నది బోస్ చేతిరాత కాదు. ఇది టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన లేఖ.

Share.

About Author

Comments are closed.

scroll