Fake News, Telugu
 

ఈ వీడియోలోని పులి దాడి మహారాష్ట్రలో జరిగింది, తెలంగాణాలో కాదు

0

ఖమ్మంలోని టేకులపల్లి నుండి మర్కోడు వెళ్లే దారిలో పులి జనాలపై దాడి చేసిందని చెప్తూ, దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఖమ్మంలోని టేకులపల్లి నుండి మర్కోడు వెళ్లే దారిలో పులి జనాలపై దాడి.

ఫాక్ట్ (నిజం): ఈ ఘటన జనవరి 2020లో మహారాష్ట్రలోని భండారా జిల్లాలో చోటుచేసుకుంది, దీనికి సంబంధించిన చాలా వార్తా కథనాలు మరియు న్యూస్ వీడియోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోలోని విజువల్స్ ని పోలినే ఫోటోని ప్రచురించిన ఒక జనవరి 2020 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఘటన మహారాష్ట్రలోని భండారా జిల్లాలో చోటుచేసుకుంది.

వార్తా కథనం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకి సంబంధించిన న్యూస్ వీడియోలు మాకు కనిపించాయి. ఈ న్యూస్ వీడియో కూడా ఈ ఘటన మహారాష్ట్రలోని భండారా జిల్లాలో జరిగిందని కచ్చితంగా చెప్పొచ్చు. వీటన్నిటి బట్టి ఈ పులి దాడి ఖమ్మంలో జరగలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఈ మహారాష్ట్రలోని భండారా జిల్లాలో పులి జనాలపై దాడి చేసిన ఘటన వీడియోని ఖమ్మంలోని టేకులపల్లి దగ్గర జరిగిందని ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll