Fake News, Telugu
 

ఈ వీడియో 2012లో టర్కీలో జరిగిన నిరసనలకు సంబంధించింది, ఇప్పుడు ఫ్రాన్స్ లో జరుగుతున్న నిరసనలకు కాదు.

0

ఫ్రాన్స్ లో పౌరసత్వ చట్టానికి వ్యతరేకంగా జరిగిన నిరసనలను ఫ్రెంచ్ పోలీసులు ఇలా టియర్ గ్యాస్ తో చెదరగొట్టారని చెప్తూ, దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫ్రాన్స్ లో పౌరసత్వ చట్టానికి వ్యతరేకంగా జరిగిన నిరసనలను ఫ్రెంచ్ పోలీసులు ఇలా టియర్ గ్యాస్ తో చెదరగొట్టిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2012లో టర్కీలోని హక్కరిలో కొందరు విద్యార్థులు జైళ్లలో ఖైదీలు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతుగా రోడ్డుపైన ప్రార్ధనలు నిర్వహిస్తుండగా పోలీసులు వారిని టియర్ గ్యాస్, వాటర్ క్యాన్స్ తో చెదరగొట్టిన ఘటనకు సంబంధించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇలాంటిదే ఒక వీడియో యూట్యూబ్ లో దొరికింది. ఈ వీడియో 09 నవంబర్ 2012న అప్లోడ్ చేసినట్టు ఉంది. పైగా ఈ వీడియో వివరణ ‘Civil Friday prayer with gas bombs – Yüksekova – Gever’ ప్రకారం ఈ ఘటన టర్కీలో జరిగినట్టు తెలుస్తున్నది. ఈ వీడియో అప్లోడ్ చేసిన తేదీ బట్టి ఈ వీడియో ఇంటర్నెట్ లో 2012 నుండే అందుబాటులో ఉందని చెప్పొచ్చు.

యూట్యూబ్ వీడియో ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా, పోస్టులో ఉన్న వీడియోని పోలిన ఫోటోలని ప్రచురించిన కొన్ని 2012 వార్తా కథనాలు మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం ఈ ఫొటోలు 2012లో  టర్కీలోని హక్కరిలో కొందరు విద్యార్థులు జైళ్లలో ఖైదీలు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతుగా రోడ్డుపైన ప్రార్ధనలు నిర్వహిస్తుండగా పోలీసులు వారిని టియర్ గ్యాస్, వాటర్ క్యాన్స్ తో చెదరగొట్టినప్పుడు తీసినవి. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈ ఘటనకి సంబంధించి మరికొన్ని వార్త కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

ఇంకా పోస్టులో ఉన్న వీడియోలో వాహనాలపై ‘POLIS’ రాసి ఉండడం చూడొచ్చు. టర్కీలో పోలీసు వాహనాలపై ఇలానే రాసివుంటుంది. ఫ్రాన్స్ లో పోలీస్ వాహనాలపై ‘POLICE‘ అని రాస్తారు. వీటన్నిటి ఆధారంగా పోస్టులో ఉన్న వీడియో 2012 టర్కీలో జరిగిన ఆందోనళకు సంబంధించిందని, ఇపుడు ఫ్రాన్స్ జరుగుతున్న నిరసనలకు కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవల ప్రాఫెట్ మొహమ్మద్ కార్టూన్లు క్లాస్ లో ప్రదర్శించిన కారణంగా శామ్యూల్ పాటీ అనే టీచర్ తలని ఒక 18 ఏళ్ల ముస్లిం యువకుడు నరికివేసిన ఘటన పారిస్ లో జరిగింది. అంతే కాక, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్ ఇస్లాంపై  చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఫ్రాన్స్ తో సహా పలు దేశాలలో ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మధ్య ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ వీడియోకి ఇప్పుడు ఫ్రాన్స్ లో జరుగుతున్న నిరసనలకు సంబంధం లేదు

Share.

About Author

Comments are closed.

scroll