Fake News, Telugu
 

ఈ దృశ్యాలు 81 సంవత్సరాల క్రితం నాటి తిరుపతి కుంభాభిషేకానివి కావు, 1960లో విడుదలైన ఒక సినిమాలోనివి

0

81 సంవత్సరాల క్రితం నాటి తిరుపతి కుంభాభిషేకం యొక్క వీడియో అని చెప్తున్న పోస్టు ఒక్కటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ పోస్టు చేస్తున్న క్లెయిమ్ వెనుక నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: 80 సంవత్సరాల క్రితం చిత్రించిన తిరుపతి కుంభాభిషేకం దృశ్యాలు కలిగిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు, శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమాలోనివి. ఎన్టీఆర్, సావిత్రి తదితరులు నటించిన ఈ చిత్రం 1960లో విడుదలైంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

సరైన కీ వర్డ్స్ ఉపయోగించి తిరుమల తిరుపతి దేవస్థానంలో 81 సంవత్సరాల క్రితం జరిగిన కుంభాభిషేకానికి సంభందించిన వీడియో గురించి వెతకగా, దీనికి సంబంధించిన వీడియో మాకు లభించలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పురాతన డాక్యూమెంటెడ్ వీడియోల గురించి వెతకగా శ్రీ వెంకటేశ్వర వైభవం అనే డాక్యుమెంటరీ లభించింది. కానీ పోస్టులో ఉన్న దృశ్యాలు ఈ డాక్యుమెంటరీలో లేవు.

తిరుమల వెంకటేశ్వర స్వామి కథాంశంగా తీసుకొని వచ్చిన ఫిక్షన్ చిత్రాల్లో ఈ దృశ్యాలు ఏమైనా ఉన్నాయో అని ఇంటర్నెట్లో వెతకగా పలు చిత్రాలు ఉన్నాయని తెలిసింది. వీటిలో 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం ఒకటి. ఎన్టీఆర్, సావిత్రి తదితరులు నటించిన ఈ చిత్రం పూర్తి కాపీ యూట్యూబ్ లో ఉంది.

సరిగ్గా పరిశీలించగా, వైరల్ వీడియోలో 81 సంవత్సరాల నాటి దృశ్యాలు అని చూపిస్తున్న క్లిప్పింగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. చిత్రంలో 2 గంటల 52 నిమిషాల దగ్గర వచ్చే మహాకుంభాభిషేకం దృశ్యాలని ఎడిట్ చేసి, 81 సంవత్సరాల నాటి అసలు దృశ్యాలుగా వైరల్ వీడియోలో షేర్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా గురించి మరింత తెలుసుకోవటానికి ‘ది హిందూ’ ప్రచురించిన ఈ ఆర్టికల్ చదవండి.

చివరిగా, ఈ దృశ్యాలు 81 సంవత్సరాల క్రితం నాటి తిరుపతి కుంభాభిషేకానివి కావు, 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమాలోనివి.

Share.

About Author

Comments are closed.

scroll