Fake News, Telugu
 

బీహార్ నామినేషన్ హాల్లో అరెస్ట్ అయిన ఈ వ్యక్తికి, 2013లో పాట్నాలో జరిగిన బాంబు దాడులకు సంబంధం లేదు

0

కాంగ్రెస్ పార్టీ తరపున బీహార్ లో నామినేషన్ వేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదిని నామినేషన్ హాల్లోనే అరెస్ట్ చేసిన NIA, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నామినేషన్ వేయడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకేలుతున్న ఫోటోలు ఈ పోస్టులో చూడవచ్చు. నరేంద్ర మోది 2014లో నిర్వహించిన బహిరంగసభలో బాంబు దాడి చేసిన ఉగ్రవాదులలో ఒకరైన ఈ వ్యక్తి, ఆ కేసులో బెయిల్ రాగానే పాకిస్తాన్ కి పారిపోయినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2013లో పాట్నాలో బాంబు దాడులకి పాల్పడిన ఉగ్రవాది కాంగ్రెస్ పార్టీ తరపున బీహార్ లో నామినేషన్ వేస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు.

ఫాక్ట్ (నిజం):  ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి బీహార్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు, CPI-ML మహాగట్బందన్ అభ్యర్ది అఫ్తాబ్ ఆలం. ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకున్నాడన్న కారణంగా ముజాఫర్పూర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆఫ్తాబ్ ఆలం ని పోలీసులు అరెస్ట్ చేసారు. 2013 లో పాట్న నగరంలో జరిగిన బాంబు దాడులకి అఫ్తాబ్ ఆలం కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Nav Bharat Times’ న్యూస్ వెబ్ సైట్ ‘16 అక్టోబర్ 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఈ ఫోటోలలో కనిపిస్తున్న వ్యక్తి CPI-ML పార్టీ కి చెందిన ఆఫ్తాబ్ ఆలం అని ఈ ఆర్టికల్ ద్వారా తెలిసింది. బీహార్ రాష్ట్రంలోని ఔరై అసెంబ్లీ నియోజికవర్గ స్థానం కోసం నామినేషన్ వేయడానికి వచ్చిన ఆఫ్తాబ్ ఆలం ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ప్రభుత్వం పనుల్లో జోక్యం చేసుకున్నాడన్న కారణం కింద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆఫ్తాబ్ ఆలం ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు మీడియాకి తెలిపారు. ఆగష్టు 2020 లో జరిగిన దీపక్ రాయ్ హత్య కేసులో న్యాయం కోసం తను చేసిన శాంతియుత ఆందోళనని కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆఫ్తాబ్ ఆలం మీడియాకి తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘Hindustan Times’ న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆదరంగా ఫొటోలోని ఆ వ్యక్తి కాంగ్రెస్ లీడర్ కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంకా, అయన అసెంబ్లీ ఎన్నికల కోసం ఫైల్ చేసిన నామినేషన్ పత్రాలలో కూడా అయన పేరు, ఫోటో, పార్టీ పేరు స్పష్టంగా చూడొచ్చు.

2013లో పాట్న నగరంలో జరిగిన వరుస బాంబు దాడులకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ దాడులకి సంబంధించి NIA ఇచ్చిన ఛార్జ్ షీట్ రిపోర్ట్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటనకి సంబంధించిన ముఖ్య దోషుల పేర్లు తెలుపుతూ NIA ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఆఫ్తాబ్ ఆలం పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. అరెస్ట్ అయిన ఆఫ్తాబ్ ఆలం కి వరుస బాంబు దాడులకి ఎటువంటి సంబంధం లేదని ఈ వివరాల ఆధారంగా చెప్పవచ్చు.

చివరగా, బీహార్ నామినేషన్ హల్లో అరెస్ట్ చేసిన  ఫోటోలోని ఈ వ్యక్తికి, 2013లో పాట్నాలో జరిగిన వరుస బాంబు దాడులకు సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll