ఒక వృద్ధుడు, అతని చుట్టూ చాలా మంది పిల్లలతో కూడిన ఒక ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఈ వృద్ధుడికి ముగ్గురు భార్యలు మరియు 32 మంది పిల్లలు ఉన్నారని, వీళ్ళందరూ ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నారని ఈ ఫోటో క్లెయిమ్ చేస్తుంది. ఈ క్లెయిమ్ లో ఎంత వాస్తవం ఉందో కనుక్కుందాం.
క్లెయిమ్ : తన ముగ్గురు భార్యలు మరియు 32 మంది పిల్లలతో ఒక వృద్ధుడి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫొటోలో చూపించింది ఒక వృద్ధుడు తన 37 మంది కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటో, ఇందులో అతని పిల్లలు మరియు మనుమలు ఉన్నారు. ఈ ఫొటోలో ఉన్న పిల్లలందరూ అతని కొడుకులు, కూతుర్లు కాదు. కావున, ఫొటోలోని క్లెయిమ్ అబద్ధం.
పోస్టులో ఉన్న ఫోటోకి యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టెక్నిక్ ఉపయోగించగా, ఈ ఫోటో ‘ది ప్రింట్’ న్యూస్ ఛానెల్ లోని ఒక వీడియో లో కనబడింది. ఈ వీడియోకి శీర్షిక ‘एक झोपड़ी में रहते हैं 38 लोग, सरकारी योजना के तहत घर न मिलने से नाराज़’ అని ఉంది. దీని తెలుగు అనువాదం: ’38 మంది ఒక చిన్న గుడిసె లో నివసిస్తున్నారు, వీళ్లంతా ప్రభుత్వం తమకి ఇల్లు మంజూరు చేయడం లేదు అని అసంతృప్తిగా ఉన్నారు’.
ఈ వీడియోలోని వృద్ధుడు తాను ఆ గుడిసెలో తన పిల్లలు, మనుమలతో నివసిస్తున్నాడని తెలిపాడు, కానీ ఆయన తనకి ముగ్గురు భార్యలు మరియు 32 మంది పిల్లలు (ఆయన కొడుకులు మరియు కూతుళ్లు) ఉన్నారని మాత్రం తెలుపలేదు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని వీడియో లో అనడం మనం చూడొచ్చు. కావున, ఈ క్లెయిమ్ లో నిజం లేదు.
చివరగా, ఫొటోలో కనిపించిన పిల్లలందరూ ఆ వృద్ధుడి పిల్లలు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఫోటోలో కనిపించిన పిల్లలందరూ ఆ వృద్ధుడి పిల్లలు కాదు - Fact Checking Tools | Factbase.us