Fake News, Telugu
 

ఈ వీడియోలో చూపిస్తున్నట్టు హుబ్లీలోని నల్లమ్మ దేవి విగ్రహం నిజంగా కళ్ళు తెరవలేదు. కొందరు స్థానికులు విగ్రహానికి ప్లాస్టిక్ కళ్ళు అమర్చారు

0

‘కర్ణాటకలోని హుబ్లీలో అమ్మవారు కళ్ళు తెరిచారు, అమ్మవారి కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి’ అంటూ ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలోని హుబ్లీలో అమ్మవారు కళ్ళు తెరచిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఇది హుబ్లీలోని నల్లమ్మ దేవి విగ్రహం, కాని ఈ విగ్రహం నిజంగా కళ్ళు తెరవలేదు. కొందరు స్థానికులు ఆ విగ్రహానికి ప్లాస్టిక్ కళ్ళు అమర్చారు. ఆగస్ట్ 2019లో కర్ణాటక హుబ్లీ ప్రాంతంలోని మంటూరు రోడ్‌లో రైల్వే సంస్థకు చెందిన స్థలంలో ఉన్న      నల్లమ్మ దేవి గుడిని ఇతర ప్రదేశానికి తరలించాలని రైల్వే సంస్థ ప్రతిపాదించింది. ఐతే అక్కడి స్థానికులలో కొందరు గుడిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నల్లమ్మ దేవి విగ్రహానికి ప్లాస్టిక్ కళ్ళు అమర్చి, నల్లమ్మ దేవి కళ్ళు తెరిచిందంటూ ఒక పుకారును సృష్టించారు. పోలీస్ విచారణలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపిస్తున్నది కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతంలో ఉన్న నల్లమ్మ దేవి విగ్రహం. పోస్టులో నల్లమ్మ దేవి కళ్ళు తెరిచిందని చెప్తున్న ఘటన ఆగస్ట్ 2019లో జరిగింది. కాని నిజానికి ఈ విగ్రహం కళ్ళు తెరవలేదు, కొంత మంది స్థానికులు విగ్రహానికి ప్లాస్టిక్ కళ్ళను అమర్చారు.

హుబ్బల్లిలోని మంటూరు రోడ్‌లోని  రైల్వే సంస్థకు చెందిన స్థలంలో ఈ నల్లమ్మ దేవి యొక్క చిన్న గుడి ఉంది. ఐతే రైల్వే వాళ్ళు ఈ గుడిని వేరే చోటుకి తరలించడానికి ప్రతిపాదించడంతో అక్కడి స్థానికులలో కొందరు ఆ గుడి తరలకుండా ఉంచేందుకు ఆ విగ్రహానికి ప్లాస్టిక్ కళ్ళను అమర్చి, నల్లమ్మ దేవి కళ్ళు తెరిచిందంటూ ఒక పుకారును సృష్టించారు.

ఈ పుకారు వ్యాపించడంతో అమ్మవారి దర్శనం కోసం చాలా మంది గుడికి రావడంతో పోలీస్ శాఖ ఈ అంశంపై విచారణ జరిపింది. పోలీస్ విచారణలో పైన తెలిపిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీన్నిబట్టి, ఈ వీడియోలోని విగ్రహం నిజంగా కళ్ళు తెరవలేదని స్పష్టమవుతుంది. ఈ ఘటనకు సంబందించిన మరికొన్ని వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు హుబ్లీలోని నల్లమ్మ దేవి విగ్రహం నిజంగా కళ్ళు తెరవలేదు. కొందరు స్థానికులు విగ్రహానికి ప్లాస్టిక్ కళ్ళు అమర్చారు.

Share.

About Author

Comments are closed.

scroll