హైదరాబాద్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీతో రాజ్ భవన్‌కు తరలివెలుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ ఆవుతుంది. హైదరాబాద్ నగరంలో బీజేపీ ఇటీవల నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు నరేంద్ర మోదీ హాజరయిన నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హైదరాబాద్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీతో రాజ్ భవన్‌కు తరలివెలుతున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 నవంబర్ నెల నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతుంది. ఈ వీడియోకి హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టులో షేర్ చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలు కనీసం 2021 నవంబర్ నెల నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతునట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. బీజేపీ భారీ ర్యాలీ దృశ్యాలంటూ ఈ వీడియో వివరణలలో ఆ యూసర్లు తెలిపారు.
25 నవంబర్ 2021 నాడు ఒక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని షేర్ చేస్తూ, బీజేపీ నాయకుడు నరేంద్ర భాటి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలంటూ వివరణలో తెలిపారు. కాని, ఈ విషయాన్నీ దృవికరిస్తూ ఇంటర్నెట్లో మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
03 జూలై 2022 నాడు విజయ సంకల్ప సభ ముగించుకున్న తరువాత ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ భవన్‌కు ప్రయాణిస్తున్న దృశ్యాలని ఇక్కడ చూడవచ్చు. 04 జూలై 2022 నాడు విజయవాడ ప్రయాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ భవన్ నుండి బేగంపేట్ వెళుతున్న దృశ్యాలని ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఎక్కడిదో స్పష్టంగా తెలియనప్పటికీ, పై వివారాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, హైదరాబాదులో ఇటీవల బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, సంబంధం లేని పాత వీడియోని బీజేపీ విజయ సంకల్ప సభ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీతో రాజ్ భవన్‌కు తరలివేలుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.