Fake News, Telugu
 

ఫోటోలో ఉన్న విమానం మోదీ, ఇతర VVIPల ప్రయాణాల కోసం తయారు చేయబడిన ‘బోయింగ్ 777-300 ఈఆర్’ (ఎయిర్ ఇండియా వన్) కాదు

0

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ వంటి VVIPల ప్రయాణాల కోసం అమెరికాలో తయారుచేస్తున్న రెండు విమానాల్లో ఒకటి తాజాగా భారతదేశంలో ల్యాండ్ అయింది. అయితే, ఆ విమానం కి సంబంధించిన ఫోటో అని చెప్తూ, ఒక విమానం లోపలి భాగం ఫోటోని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):  భారత ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన విమానం ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసినది ఒక పాత ఫోటో. ఫోటోలో కనిపిస్తున్నది ‘బోయింగ్ 787-8 ‘డ్రీం లైనర్ ’ విమానం; భారత VVIPల ప్రయాణాల కోసం తయారు చేయబడిన ‘బోయింగ్ 777-300 ఈఆర్’ (ఎయిర్ ఇండియా వన్) కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో వివిధ వెబ్ సైట్లలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలో కనిపిస్తున్నది ‘బోయింగ్ 787-8 డ్రీం లైనర్’ విమానం అని 2017 లో ‘ది టైమ్స్’ వారు ప్రచురించిన ఆర్టికల్ లో చూడవొచ్చు. అదే విషయం మరిన్ని వెబ్ సైట్లలో (ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ) చూడవొచ్చు. కావున, అది భారత VVIPల ప్రయాణాల కోసం తయారు చేయబడ్డ ‘బోయింగ్ 777-300 ఈఆర్’ (ఎయిర్ ఇండియా వన్) కాదు.

‘బోయింగ్ 777-300 ఈఆర్’ (ఎయిర్ ఇండియా వన్) కి సంబంధించిన లోపలి భాగం ఫోటోలను ‘న్యూస్ 18’ వారి వెబ్సైటులో చూడవొచ్చు.

భారత VVIPల ప్రయాణాల కోసం అమెరికాలో తయారుచేస్తున్న రెండు విమానాల తయారీ ఖర్చు ఎంతో కచ్చితంగా తెలియదు (కొన్ని మీడియా సంస్థలు సుమారు 8,400 కోట్ల రూపాయలు అని రిపోర్ట్ చేసాయి), కానీ గత మూడు సంవత్సరాల బడ్జెట్లలో సుమారు 4,632 కోట్ల రూపాయలు ‘స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ నిర్వహణ’ కోసం కేటాయించినట్టు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ఫోటోలో కనిపిస్తున్నది ‘బోయింగ్ 787-8 డ్రీం లైనర్’ విమానం; భారత VVIPల ప్రయాణాల కోసం తయారు చేయబడిన ‘బోయింగ్ 777-300 ఈఆర్’ (ఎయిర్ ఇండియా వన్) కాదు.

Share.

About Author

Comments are closed.

scroll