Fake News, Telugu
 

పలాస రైల్వే స్టేషన్ లో దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి వైరల్ అవుతున్న ఈ మెసేజ్, 2019లో పోస్ట్ చేసినది

0

పలాస రైల్వే స్టేషన్ లో తనకు దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి ఒక వ్యక్తి పెట్టిన ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలాస రైల్వే స్టేషన్ లో తనకు ఒక పర్సు, ID కార్డులు దొరికాయి అని, అందులో 3300 రూపాయలతో పాటు కొన్ని కార్డ్స్, ఫోటోలు ఉన్నాయంటూ ఈ మెసేజ్ లో పేర్కొన్నారు. ఈ పర్సు పోగొట్టుకున్నది గణపతి దిల్లెశ్వర్రావు అనే దేశ సైనికుడంటూ అందులో తెలిపారు. తన పేరు, మొబైల్ నెంబర్ ఈ మెసేజ్ లో తెలుపుతూ, వీలైనంత మందికి ఈ మెసేజ్ ఫార్వర్డ్  చేయండి అని అందులో పేర్కొన్నారు. ఈ మెసేజ్ ని వైరల్ చేస్తూ పెడుతున్న పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పలాస రైల్వే స్టేషన్ లో దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి ఒక వ్యక్తి పెట్టిన ఫార్వర్డ్ మెసేజ్.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫార్వర్డ్ మెసేజ్ 2019లో పోస్ట్ చేసినది. పది నెలల క్రితం, పలాస రైల్వే స్టేషన్ లో తనకి దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి ఒక వ్యక్తి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టు మా విశ్లేషణలో తెలిసింది. తన మెసేజ్ వైరల్ అవ్వడంతో తరువాతి రోజు అవి పోగొట్టుకున్న ఆర్మీ జవాను బంధువు తన నుంచి ఆ వస్తువులన్నీ తీసుకొని వెళ్లినట్లు ఈ మెసేజ్ ని పెట్టిన వ్యక్తి FACTLY కి వివరించారు.

ఈ ఫార్వర్డ్ మెసేజ్ లో పేర్కొన్న వ్యక్తి మొబైల్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగా, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న అతని మెసేజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపారు. పది నెలల క్రితం తనకి పలాస రైల్వే స్టేషన్ లో ఒక పర్సు దొరికింది అని ఆయన తెలిపారు. దొరికిన ఆ పర్సులో కొంత డబ్బు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాగే ATM కార్డులు ఉన్నట్టు తెలిపారు. ఈ కార్డుల ఆధారంగా పర్సు పోగొట్టుకున్న వ్యక్తి ఒక ఆర్మీ జవాన్ అని కనుగొన్నట్టు ఆయన మాకు చెప్పారు. అది పోగొట్టుకున్న ఆ ఆర్మీ జవాన్ ని సంప్రదించడానికి పర్సు లోని ఫోటోలని, కార్డులని అలాగే డబ్బులని ఫోటోలు తీసి వాట్సాప్, ఫేస్బుక్ అలాగే మరికొన్ని సోషల్ మీడియా సైటులలో పోస్ట్ చేసినట్టు అయన తెలిపారు.

సోషల్ మీడియాలో తను పెట్టిన ఈ మెసేజ్ వైరల్ అవ్వడంతో, మూడు గంటల్లోనే పర్సు పోగొట్టుకున్న వ్యక్తికి సంబంధించిన బంధువులు తనని సంప్రదించారని  తెలిపారు. తరువాతి రోజు, పలాస రైల్వే స్టేషన్ లో క్లర్క్ గా పనిచేస్తున్న ఆ ఆర్మీ జవాన్ బందువు, తన నుంచి ఆ వస్తువులన్నీ తీసుకొని వెళ్లినట్లు ఆయన స్పష్టం చేసారు.

అయితే, పది నెలల క్రితం తను పెట్టిన ఈ మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి ఈ మధ్య వాట్సాప్ లో షేర్ చేయడంతో, మళ్ళీ ఈ మెసేజ్ వైరల్ అవుతున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు. తన మెసేజ్ లో ‘ఈ రోజు’ కి బదులు ‘తేది’ పెట్టి ఉంటే ఈ ఫోన్ కాల్స్ బాధ తనకు ఉండేది కాదు అని ఆయన తెలిపారు. 2019 లో ఇదే మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తూ పెట్టిన పోస్టులని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2019 లో పలాస రైల్వే స్టేషన్ దగ్గర తనకు దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి పెట్టిన ఫార్వర్డ్ మెసేజ్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll