Fake News, Telugu
 

ఈ ఫోటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోని మొట్టమొదట అంబులెన్స్ వాహనం కాదు

0

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారి ఉపయోగించిన అంబులెన్స్ వాహనం యొక్క చిత్రం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రపంచంలోనే మొదటిసారిగా ఉపయోగించిన అంబులెన్స్ చిత్రం.

ఫాక్ట్ (నిజం): 1940లో హోమ్ గార్డులు ఉపయోగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ-గ్యాస్ అంబులెన్స్ వాహనం యొక్క చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోని 29 జులై 1941 నాడు తీశారు. అయితే, 1487 కాలం నుండి వివిధ దేశాలలో గుర్రపు మరియు ఎడ్ల బండ్లను అంబులెన్స్ వాహనాలుగా ఉపయోగించారు. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్, 19వ శతాబ్దంలో అమెరికా సైన్యం గుర్రపు బండ్లని అంబులెన్స్  వాహనాలను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ ఫోటోలో చూపిస్తున్నది ప్రపంచంలోని మొట్టమొదట అంబులెన్స్ కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘Getty Images’ వెబ్సైట్లో పబ్లిష్ అయి ఉన్నట్టు తెలిసింది. 1940లో హోమ్ గార్డులు ఉపయోగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ-గ్యాస్ ఆంబులెన్స్ వాహనం యొక్క చిత్రమని ఈ ఫోటో వివరణలో తెలిపారు. ఈ ఫోటోని 29 జులై 1941 నాడు తీసినట్టు ‘Getty Images’ వెబ్సైట్లో తెలిపారు.

అయితే, 1487 కాలం నుండి వివిధ దేశాలలో గుర్రపు మరియు ఎడ్ల బండ్లను ఆంబులెన్స్ వాహనాలుగా ఉపయోగించినట్టు పలు వెబ్సైట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్, 19వ శతాబ్దంలో అమెరికా సైన్యం గుర్రపు బండ్లని ఆంబులెన్స్ వాహనాలుగా ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో అమెరికా సైన్యం ఉపయోగించిన అంబులెన్స్ వాహనాల చిత్రాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోని మొట్టమొదట అంబులెన్స్ చిత్రం కాదని ‘Reuters’ వార్తా సంస్థ కూడా స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోని మొట్టమొదట అంబులెన్స్ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ ఫోటోలో కనిపిస్తున్న అంబులెన్స్ వాహనం ప్రపంచంలోని మొట్టమొదట అంబులెన్స్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll